Wednesday, May 1, 2024

కొత్త కేసులు 61

- Advertisement -
- Advertisement -

Corona positive cases

 

సోమవారం ఒక్కరోజే 61 కరోనా కేసులు.. ఒకరు మృతి
592కు చేరుకున్న వైరస్ బాధితుల సంఖ్య
అత్యధికంగా జిహెచ్‌ఎంసి పరిధిలో 267.. తరువాత నిజామాబాద్‌లో 50
ఐదు జిల్లాల్లో జీరో కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరుకుంది. ఇందులో ఒకరు నిన్న చనిపోగా, మరణాల సంఖ్య 17కు చేరుకుంది. ఇప్పటి వరకు 103 మంది కొవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం 28 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులు 267 పాజిటివ్ కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలో రాగా, ఆ తరువాత స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉంది. అక్కడ 50 మందికి కరోనా సోకింది. వికారాబాద్‌లో 24, వరంగల్ అర్బన్‌లో 25, జోగులాంబ గద్వాల జిల్లాలో 20, సూర్యాపేటలో 20, మేడ్చల్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో 18 చొప్పున, నల్లగొండలో 12, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో 11 చొప్పున కేసులు వచ్చాయి.

ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లో 7 చొప్పున, మెదక్‌లో 6, భద్రాద్రి కొత్తగూడెంలో 04, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం జిల్లాల్లో మూడు చొప్పున, నాగర్ కర్నూల్, జగిత్యాల, ములుగు, జనగాం, పెద్దపల్లిలో రెండు కేసులు, మహబూబాబాద్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైనట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. వరంగల్ రూరల్, యదాద్రి భువనగరి, నారాయణ్‌పేట్, వనపర్తి, మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ నెల 10, 11 తేదీల్లో 16 చొప్పున కేసులు రాగా, 12వ తేదీన 28 కేసులు, 13న 61 కేసులు నమోదుకావడం గమనార్హం. దీనినిబట్టి వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతుందనేది స్పష్టమౌతోంది. ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్ కేసుల్లో ప్రధానంగా నిజాముద్దీన్ మర్కజ్‌కు లింక్ ఉన్నవి కాగా, కొత్తగా దేవ్‌బంద్ వెళ్లొచ్చిన వారిలోనూ కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.

246 కంటైన్‌మెంట్ క్లస్టర్లు
వైరస్ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో కంటైన్‌మెంట్ క్లస్టర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 246 కంటైన్‌మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఇందులో 228 ప్రాంతాల్లో 6.41 లక్షల కుటుంబాలను వైద్యాధికారులు సర్వే చేశారు. మొత్తంగా 27,32,644 మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి కుంటుంబ సభ్యులు, వారి సెకంటరీ కాంటాక్ట్‌ని ట్రేస్ చేసి పరీక్షలు చేస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

కానిస్టేబుల్ కుటుంబంలో
నలుగురికి కరోనా
గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. సోమవారం సైదాబాద్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబంలోని నలుగురికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. మర్కజ్ వెళ్లిన వారిని గుర్తించి పరీక్షలు చేస్తుండగా ,అందులో కానిస్టేబుల్ ఉండటంతో అతని రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చింది. వెంటనే కానిస్టేబుల్ ఇద్దరు కొడుకులు,కూతురు, మనవడికి పరీక్షలు చేశారు. వారికి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారు ఎంతమందిని కలిశారన్న దానిపై పోలీసులు, వైద్యాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Corona positive cases reached 592
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News