Sunday, May 12, 2024

యూపీని అల్లర్ల రహితం చేయడానికి ఓటు వేయండి : మోడీ

- Advertisement -
- Advertisement -

Modi urges voters to keep UP riot-free

న్యూఢిల్లీ : అల్లర్లు జరగని రాష్ట్రంగా ఉత్తరప్రదేవ్‌ను తీర్చి దిద్దడానికి ఓటు వేయాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను కోరారు. నేరగాళ్లను జైళ్లకు పంపించడానికి , మహిళలు నిర్భయంగా జీవించడానికి అవకాశం లభించే విధంగా ఈ శాసన సభ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. సహరాన్‌పూర్‌లో గురువారం జరిగిన బీజీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో చలిలో కూడా బయటకు వస్తున్న ఓటర్లను మోడీ ప్రశంసించారు. యూపీ బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను సంక్షేమం కోసం దృఢ సంకల్పంగా అభివర్ణించారు. పీఎం కిసాన్ యోజన లబ్ధిని నిరంతరం రైతులు పొందాలంటే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వం ఏర్పడటం చాలా ముఖ్యమని చెప్పారు. చెరకు రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామన్నారు. చెరకును ఇథనాల్ ఉతత్తి కోసం కూడా వాడతామన్నారు. ఈ ఇథనాల్ నుంచి రూ. 12,000 కోట్లు వచ్చిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News