Saturday, April 27, 2024

డికె శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసు కొట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తనపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) తనకు జారీచేసిన సమన్లను కొట్టివేయడానికి కర్నాటక హైకోర్టు నిరాకరించడంతో దీన్ని సవాలు చేస్తూ డికె శివకుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ నాయకుడు శివకుమార్‌పై మనీ లాండరింగ్ కేసును కొట్టివేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

2017 ఆగస్టులో ఆదాయపు పన్ను శాఖ పన్ను ఎగవేత ఆరోపణలపై డికె శివకుమార్‌తోపాటు లిక్కర్ వ్యాపారి సచిన్ నారాయణ్, లగ్జరీ బస్సుల యజమాని సునీల్ కుమార్ శర్మ, కర్నాటక భవన్(ఢిల్లీ) ఉద్యోగి ఎ హనుమతయ్య, అక్కడే కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న ఎన్ రాజేంద్రకు చెందిన ఢిల్లీలోని అనేక చోట్ల సోదాలు జరిపింది. ఈ సోదాలలో రూ. 8.59 కోట్ల మేరకు నగదును స్వాధీనం చేసుకుంది. ఇది తమకు వ్యసాయ ఆదాయంగా డికె శివకుమార్, వ్యాపార ఆదాయంగా శర్మ ఐటి శాఖకు చూపారు. నిందితులపై పన్ను ఎగవేత ఆరోపణలపై బెంగళూరు కోర్టులో ఐటి శాఖ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ ఆధారంగా ఇడి 2018లో మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News