Wednesday, May 15, 2024

సకాలంలోనే రుతుపవనాలు!

- Advertisement -
- Advertisement -

ఈ సారి సకాలంలోనే రుతుపవనాలు !
తుపాను గాలులతో ముందే కదిలే అవకాశం
భారత వాతావరణ శాఖ అంచనా
తెలంగాణలో భగ్గుమన్న ఎండలు
మనతెలంగాణ/హైదరాబాద్: భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లటి కబురుందించింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కూడా సకాలంలోనే దేశంలోకి ప్రవేశించే అకాశలు ఉన్నట్టు వెల్లడించింది. జూన్ మొదటి వారంలోనే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు తెలిపింది.సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ సారి కూడా అదే సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలిపింది. సాధారణ పరిస్థితుల్లో అయితే నైరుతి రుతుపవనాలు మే నెలలో అండమాన్ నికోబార్‌లో ప్రారంభమవుతాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను వల్ల వీచే బలమైన గాలులతో అవి ఇంకా ముందుగానే కదిలే అవకాశం కూడా ఉందని అంచనా వేసింది. అదే జరిగితే రుతుపవనాలు ఈ సారి నాలుగైదు రోజులు ముందుగానే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.

భగ్గుమన్న ఎండలు!
వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకూ అకాల వర్షాలు వడగండ్ల వానలతో వర్షాకాలాలన్ని తలపించిన వాతావరణం చల్లబడింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడపోయాయి. అయితే గత 24గంటలుగా మళ్లీ రాష్ట్ర మంతటా ఉష్ణోగ్రతలు పుంజుకుంటున్నాయి. శనివారం రాష్ట్రంవలోని పలు ప్రాంతాల్లో ఎండలు భగ్గుమన్నాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దిగువ స్థాయిలో వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయి. రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి కొన్ని చోట్ల 41నుండి 44డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్ , పరిసర జిల్లాల్లో 37నుండి 41డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. శనివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా అదిలాబాద్‌లో 42.5 డిగ్రీలు , భద్రాచలంలో 40.2, హన్మకొండలో 40.5, హైదరాబాద్‌ల ఓ 39.7, ఖమ్మంలో 39.6, మహబూబ్ నగర్‌లో 39, మెదక్‌లో 42, నిజామాబాద్‌లో 42.5, రామగుండంలో 42, హయత్ నగర్‌లో 38.3, పటాన్ చెరులో 37.4, రాజేంద్రనగర్‌లో 38డిగ్రీల ఉష్ణోగ్రతలు నమదయ్యాయి.

తీవ్ర తుపానుగా మారిన మోకా
బంగాళాఖాతంలో ఏర్పడిన మోకా తుపాను అత్యంత తీవ్ర తుపానుగా మారింది. ఉదయం ఇది ఉత్తర రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది పోర్ట్ బ్లెయిర్‌కి ఉత్తరఆగ్నేయ దిశలో 560కి.మి దూరంలో కోక్స్ బాజర్ (బంగ్లాదేశ్)కి దక్షిణ నైరుతి దిధలో 680 కి.మి దూరంలో సిట్టే (మయన్మార్)కు నైరుతి దిశలో 600కి.మి దూరంలో ఉంది. ఈ తుపాను సుమారుగా ఉత్తరఈశాన్య దిశ వైపుగా కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఆగ్నేయ బంగ్లాదేశ్ ,ఉత్తర మయన్మార్ తీరాల మధ్యలో కొక్స్ బజార్ క్యుక్‌ప్యూ మధ్యలో సిట్టేకు అతి సమీపంలో గంటకు 160కిలోమీటర్ల గాలి వేగంతో తీరం దాటే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాబేయో రోజుల్లో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణం కన్నా 2నుండి 4డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News