Thursday, May 9, 2024

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మోర్గాన్‌

- Advertisement -
- Advertisement -

Morgan who won the toss and elected to bat

 

దుబాయ్ : ఐపిఎల్‌-13 సీజన్ లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టామ్‌ బాంటన్‌, నాగర్‌కోటి స్థానంలో శివమ్‌ మావి, క్రిస్‌ గ్రీన్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్లు మోర్గాన్‌ చెప్పాడు. సీజన్‌ ఆరంభం నుంచి ముంబై పేస్‌ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న జేమ్స్‌ పాటిన్సన్‌కు విశ్రాంతినిచ్చినట్లు ముంబై సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు. అతని స్థానంలో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు. కొత్త కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలో కోల్‌కతా బరిలో దిగుతోంది. కోల్‌కతా కెప్టెన్సీ నుంచి దినేష్ కార్తీక్ తొలగిన విషయం తెలిసిందే.

ముంబాయి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, కౌల్టర్ నైల్ ట్రెంట్ బౌల్ట్, బుమ్రా.

కోల్‌కతా జట్టు: రాహుల్ త్రిపాఠి, శుభమన్ గిల్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్, రస్సెల్, క్రిస్ గ్రీన్, కమిన్స్, శివమ్ మావీ, చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News