Friday, April 26, 2024

నిబంధనలకు తూట్లు

- Advertisement -
- Advertisement -

Motorists are violating vehicle number plate regulations

సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు
పట్టించుకోని అధికారులు
నిర్లక్ష్యంలో వాహన దారులు

హైదరాబాద్: నేటి యువత తమ తెలివి తేటలను సక్రమం మార్గంలో ఉపయోగించక పోవడంతో అవి వారికే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదాలను తీసుకు వస్తున్నాయి. వారు తమ తెలివి తేటలను సక్రమ మార్గంలో ఉపయోగిస్తే దేశ అభివృద్ధికి, లేదా కనీసం వారికి వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తాయి. కాని వారు ముఖ్యంగా వారు తమ అతి తెలివి తేటలను వాహనాల నెంబర్ ప్లేట్ల మీద చూపుతున్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహన నంబర్ పేట్లను స్వయంగా పాడు చేయడం,కాని వాహన నెంబర్లను కనపడకుండా చేయడం కాని చేయరాదు. కాని వారు ట్రాఫిక్ ఛలనాలను తప్పించుకునేందుకు వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు.

నగరంలో శాంతి భద్రతల రక్షణకే కాకుండా అస్థవ్యస్థంగా ఉన్న ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వినియోగించు కోవడంలో భాగంగా అధికారులు ప్రతీ ట్రాఫిక్ కూడల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహన దారులకు ఛలానాలను వారి చిరునామకు పంపుతున్నారు. అయితే ఈ విధంగా తమ ఇళ్ళకు ట్రాఫిక్ ఛలాలను రాకుండా చేసుకునేందుకు కొందరు యవకులు ముఖ్యంగా కాలేజి యువత ఇటువంటి చర్యలకు పాల్పతుండగా, మరి కొంత మంది సంఘ విద్రోహ శక్తులు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తూ తమ పనులను చక్కపెట్టుకుంటున్నారు. వాహన దారులు ఈ విధంగా నంబర్‌ప్లేట్‌ను మార్చి తిరుతున్న సందర్భాల్లో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారికి సంబంధించిన సమాచారం చేరవేయడం కూడా కష్టంగా మారుతుంది. తద్వారా వారు మరిన్ని సమస్యల్లో చుక్కుకునే అవకాశం కూడా ఉంది.

కనిపించని నిఘా…..

ట్రాఫిక్ ఛలానాలు,డ్రంక్ అండ్ డ్రైవ్ మీద దృష్టి పెడుతున్న ట్రాఫిక్ అధికారులు ఇటువంటి వాహనాల మీద ఏ మాత్రం దృష్టి పెట్డడం లేదు. దాంతో వారు ఇష్టాను సారంగా తమ వాహనాల నెంబర్ ప్లేట్లను నిబంధనలకు విరుద్దంగా యథేచ్చగా పాడు చేస్తూ నగర రోడ్లు మీద సవారి చేస్తున్నారు. అంతే కాకుండా మరి కొంత మంది వాహన దారులు సీఎం కాన్వాయ్‌లోని టిఎస్ 09 కె 6666 నెంబర్‌ను తమ వాహనాలపై నెంబర్ ప్లేట్ల రాసుకుని యథేచ్చగా తిరుగుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ హైసెక్యూర్టీ నెంబర్ ప్లేట్ (హెచ్‌ఆర్‌ఎస్‌పి) వినియోగిస్తుండగా మరి కొందరు సాధారణ నెంబర్ పేట్ల మీద ఇందుకు సంబంధించిన నెంబర్‌ను వినియోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఈ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు ఈ విధంగా తిరుగుతున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేక పోతే వాటి ద్వారా జరిగే సంఘటనలకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందనడంలో ఎటుంటి సందేహం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News