Saturday, April 27, 2024

మంత్రి కెటిఆర్‌కు మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక అరుదైన బహుమతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా ప్రముఖ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక ఆయనకు అరుదైన బహుమతి సిద్ధం చేసింది. స్వయంగా కెటిఆర్ అభిమాని అయిన స్వప్నిక ఆదివారం ఆయన జన్మదినం సందర్భంగా తన అద్భుత కళతో చిత్రపటాన్ని గీసింది. మాటలతో, చేతిలతో, సాయం చేయటం, ఒకరికి సపోర్ట్‌గా నిలవటం లాంటి ఎన్నో విషయాల్లో తననెంతో ప్రేరేపించిన కెటిఆర్‌ను అన్నయ్యగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. కెటిఆర్ చేసిన సేవా కార్యక్రమాలు, ప్రత్యేకించి పంజాబ్‌కు చెందిన దివ్యాంగ చెస్ క్రీడాకారిణి మల్లికా హుండాకు తానున్నానంటూ ధైర్యం ఇచ్చి చేసిన 15 లక్షల ఆర్థిక సాయం తనలో ఎంతగానో స్ఫూర్తి నింపాయని స్వప్నిక తన అంతరంగాన్ని వెలిబుచ్చింది. ఆ సాయం తనలాంటి వారికి ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చిందని అభిప్రాయపడింది. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. తనను కలిసేందుకు ఒక్క అవకాశం ఇస్తే, తను గీసిన చిత్రాన్ని అందిస్తానని ట్విట్టర్ వేదికగా కెటిఆర్‌ను స్వప్నిక కోరింది. ఎపిలోని విజయనగరం జిల్లా నాయా రాలవలసకు చెందిన స్వప్నిక చిన్నప్పుడు విద్యుత్ షాక్ వల్ల రెండు చేతులు కోల్పోయింది. అయినా ఏమాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోకుండా నోటితోనే అద్భుతంగా పెయింటింగ్స్ వేయడం నేర్చుకుంది. సామాజికవేత్తలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల చిత్రపటాలతో పాటు సామాజిక అంశాలు, ఆడపిల్లలకు సంబంధించిన అంశాలపై తన నోటితోనే కళాఖండాలను గీస్తూ అబ్బురపరుస్తుంటుంది. ఈ మధ్య విడుదలైన రాధేశ్యామ్ సినిమాలోని ఓ సన్నివేశం తననెంతో కదిలించిందని, ఆ మూవీకి సంబంధించి ఓ పెయింటింగ్ వేసింది. దానిని ఆ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణకు అందించి ‘రాధేశ్యామ్’ తననెంతో కదిలించిందని, అలాంటి సన్నివేశాలతో తనలాంటి వాళ్లలో స్ఫూర్తి నింపుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసింది.
జన్మదిన శుభాకాంక్షలు కెటిఆర్ అన్నయ్య…
‘జన్మదిన శుభాకాంక్షలు కెటిఆర్ అన్నయ్య. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జురుపుకోవాలని మీ చెల్లి స్వప్నిక కోరకుంటోంది. మీరంటే నాకెంతో అభిమానం. మీరొక గొప్ప వ్యక్తి. మీ పుట్టినరోజు సందర్భంగా మీ డ్రాయింగ్ వేశాను మీరు చేసే సేవా కార్యక్రమాలు నాకెంతో నచ్చుతాయి. అందులో జనవరి 10 న పంజాబ్ దివ్యాంగురాలైన చెస్ ప్లేయర్‌కు మీరు సపోర్ట్‌గా ఉండటం నన్నెంతో కదిలించింది. ఎందుకంటే మాలాంటి వాల్లకు మీలాంటి వ్యక్తులు చేయూతనిస్తుంటే ఇంకా మరెన్నో సాధించాలన్న స్ఫూర్తి కలుగుతుంది. ఇలాంటివి చేస్తూ మీరు ఒక రోల్ మోడల్‌గా ఉన్నారు. సో.. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా’ అని తెలిపింది.

Mouth Artist Swapnika Special gift for KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News