Saturday, April 27, 2024

మునుగోడు కాంగ్రెస్‌లో తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

MP Komatireddy should be expelled from Congress party

మునుగోడు: పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెడుతున్న భువనగిరి లోకసభ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి బహిష్కరించాలని మునుగోడు నియోజకవర్గ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ నాయకులు పొలాగోని సైదులు గౌడ్, ఉకోండి యంపిటిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపల్లి రాజు, జాల లింగయ్య, గంధం లింగుస్వామి, బోయపల్లి శ్రీను, సోమగాని మహేష్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తమను కలిసిన మీడియాతో వారు మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు ప్రపోజల్ చేసిందే ఎంపి కోమటిరెడ్డి అయినప్పుడు ప్రచారానికి రాకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్నది బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. మూడేండ్ల నుండి బిజెపి కి టచ్ లో ఉన్నాను అంటూ స్వయంగా ఆయన తమ్ముడు మునుగోడు మాజీ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంగీకరిస్తున్నందున ఇప్పుడు అన్న కుడా పార్టీలో ఉంటూ కోవర్ట్ చేస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నాయన్నారు.

కుటుంబ స్వార్థం కోసం రాజీనామా చేసింది చాలక నియోజకవర్గ అభివృద్ధికి రాజీనామా చేసమంటూ రాజగోపాల్ రెడ్డి చెబుతున్న మాటల్లో నిజం లేదని స్వయంగా ఆయన మాటల్లోనే తేలిపోయిందన్నారు. అటువంటి అన్న తమ్ముళ్లు అవకాశం దొరికితే యావత్ తెలంగాణను అమ్ముకుంటురాని దుయ్యబట్టారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాక రాజీనామా చేయలేదని కుటుంబానికి సరిపడ నిధులు సమకూర్చుకోవడానికే రాజీనామా చేశారని తెలిపోయిందన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపిస్తే ఆ నమ్మాకాన్ని మోడీ, అమిత్ షాలకు అమ్ముకుని నయావంచనకు పాల్పడ్డారని విమర్శించారు. అటువంటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై 24 గంటలవ్యవధిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే తామంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News