Sunday, May 5, 2024

పైవేట్ ఆసుపత్రులపై హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

TS HC serious on police for stop ambulances at border

మనతెలంగాణ/హైదరాబాద్: కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ మంగళవారం కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిల్ వేశారు. కరోనా పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రులు అందినకాడికి దండుకునే ప్రయత్నమే తప్పితే, జాలిచూపే పరిస్థితి లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు తీసుకున్న విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయలు లేవని, కోవిడ్ కష్ట కాలంలో గత్యంతరం లేక జనం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న చాలా ప్రైవేట్ ఆస్పత్రులు జనాలను జలగల్లా పీడిస్తున్నారని పిల్ ద్వారా ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
బ్లాక్ ఫంగ్‌స్‌పై:
బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలైంది. న్యాయవాది జయంత్ జయసూర్య ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఈ వ్యాధికి ఉపయోగించే ఇంజెక్షన్లను ఎక్కువగా ఉత్పత్తి చేసి అందుబాటులో ఉంచాలని ఆ పిటీషన్‌లో కోరారు. బ్లాక్ ఫంగస్ వలన ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌పై దృష్టి సారించి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చూడాలని పిటీషనర్ కోరారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

MP Venkat Reddy filed PIL in HC on Private Hospitals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News