Monday, May 6, 2024

28న ముదిరాజ్ కార్తీక మాస వన భోజనాలు

- Advertisement -
- Advertisement -

Mudiraj karthika vana bhojanalu
మన తెలంగాణ/పంజాగుట్ట: తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ల కార్తీక మాస వనభోజనాల మహోత్సవాన్ని ఈ నెల 28న జూబ్లీ బస్‌స్టేషన్ స మీపంలోని కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహం పక్కన కంటోన్మెంట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్టు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షులు పిట్ల నాగేష్ ముదిరాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే బహుజనుల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తులలో కొర్వి కృష్ణస్వామి ముఖ్యమైన అని వ్యక్తి గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వాలు కొర్వి కృష్ణస్వామి చరిత్రని విస్మరించాయని మండిపడ్డారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొర్వి కృష్ణస్వామి గురించి 10వ తరగతి పుస్తకాలలో ముద్రించడంతో పాటు, ఆయన జీవిత చరిత్రని పుస్తకంగా ముద్రించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బహుజనుల అభ్యున్నతికి కృషి చేసిన కృష్ణస్వామి సేవలను గుర్తించిన టి.ఆర్.ఎస్. ప్రభుత్వానికి ముదిరాజ్ సమాజం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News