Tuesday, April 30, 2024

గంటకు రూ.90 కోట్లు

- Advertisement -
- Advertisement -

Mukesh Ambani richer for the ninth time

 

లాక్‌డౌన్‌లోనూ వేగంగా పెరిగిన ముకేశ్ సంపాదన
తొమ్మిదో సారీ అత్యంత సంపన్నుడిగా అంబానీ
రెండు, మూడు స్థానాల్లో హిందూజా బ్రదర్స్, శివ్ నాడార్
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 వెల్లడి

ముంబై : దేశీయంగా ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తున్నప్పటికీ సంపన్నుల సంపద మాత్రం పెరుగుతూనే ఉంది. దీనికి ఉదాహరణ తాజాగా విడుదల చేసిన ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితా. ఈ లిస్ట్‌లో ప్రపంచంలోనే ఐదో ధనవంతుడి గా పేరుగాంచిన ముకేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత) మొద టి స్థానం పొందారు. నంబర్ 1 భారతదేశ సంపన్నుడిగా ముకేశ్ ఎంపిక కావడం ఇది వరుసగా తొమ్మిదోసారి కావడం విశేషం. ముకేశ్ సంప ద ఈ జాబితాలో ఆయన తర్వాత ఐదు స్థానాల్లో ఉన్న వారి మొత్తం నికర విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మార్చి లాక్‌డౌన్ నుంచి ఆయన ప్రతి గంటకు రూ.90 కోట్లు సంపాదించారు.

ముకేశ్ నికర ఆస్తుల విలువ రూ.2,77,700 కోట్ల నుంచి రూ.6,58,400 కోట్ల కు పెరిగింది. అంటే 73 శాతం పెరిగింది. 2020 ఆగస్టు 31 వరకు రూ.1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన భారతదేశ సంపన్నులను ఈ జాబితాలో చేర్చారు. ఈసారి రూ.1000 కోట్లు దాటిన వారి సంఖ్య 828 కాగా, 2019లో ఎక్కువగా 953 మందితో పోలిస్తే ఈసారి తగ్గింది. ఈ జాబితాలో రెండో స్థానంలో లండన్‌కు చెందిన హిందూ జా సోదరులు (ఎస్‌పి హిందూజా, వారి ముగ్గురు సోదరులు) రూ.1,43,700 కోట్ల ఆస్తులతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో మూడో స్థానంలో రూ.1,41,700 కోట్ల ఆస్తులతో హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ నాదర్ ఉన్నారు. ఆ తర్వాత నాలుగో స్థానంలో గౌతమ్ అదానీ, కుటుంబం, ఐదవ స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ ఉన్నారు.

రాధాకిషన్ దమానికి చోటు

అవెన్యూ సూపర్‌మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020లో ఏడో స్థానంలో ఉన్నా రు. టాప్ 10 జాబితాలో ఇంకా సీరం ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ ఎస్ పూనవాలా, కోటక్ మహీంద్రా బ్యాంకుకు చెందిన ఉదయ్ కోటక్, సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వీ, సైరస్ పల్లోంజి మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజి మిస్త్రీ ఉన్నారు.

తెలంగాణ, ఎపి నుంచి 62 మంది

ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 62 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా సంపన్నులుగా ఉన్నవారిలో ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీకి చెందిన వారు 20 మంది ఉన్నారు. తెలంగాణ, ఎపి నుంచి ఫార్మా రంగానికి చెందిన వారు 32 శాతం ఉన్నారు. ఆ తర్వాత ఫుడ్‌ప్రాసెసింగ్ (11 శాతం), కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ (8 శాతం) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News