Sunday, April 28, 2024

80 ఏండ్ల న్యాయపోరాటం.. మహిళకు దక్కిన రెండు ఫ్లాట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: 93 ఏండ్ల మహిళ అలైస్ డిసౌజాకు సౌత్ ముంబైలోని రూబీ మాన్షన్‌లో ఉండే రెండు ఫ్లాట్లు చెందుతాయని, వాటిని ఆమెకు అప్పగించాలని మహారాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నివాసాలు తనకే చెందుతాయని ఈ మహిళ దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా కోర్టుల్లో కేసులు వేస్తూ వస్తోంది. 1946 జులైలోనే ఈ ఫ్లాట్లను ఆమెకు అప్పగించాలని ఉత్తర్వులు వెలువడ్డా, వీటిని ఆక్రమించుకుని ఉన్న మాజీ ప్రభుత్వ అధికారి వీటిని ఖాళీ చేయలేదు.

500 చదరపు అడుగులు, 600 చదరపు అడుగుల ఈ ఫ్లాట్లకు చెందిన భవనాన్ని 1942లో అప్పటి డిఫెన్స్ చట్టం మేరకు బ్రిటిష్ పాలకులు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉండే ప్రైవేటు ఆస్తులను అప్పటి పాలకులు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ఈ చట్టంతో వీలేర్పడింది. అయితే తరువాత వెలువడ్డ ఉత్తర్వుల మేరకు ఈ ఫ్లాట్ల ఓనరుకు వీటిని అప్పగించాల్సి ఉంది. అయితే ఇది జరగలేదు. ఈ క్రమంలో పూర్వాపరాలను విశ్లేషించుకుని న్యాయమూర్తులు ఆర్‌డి ధనూకా, ఎంఎం సతాయేతో కూడిన ధర్మాసనం ఈ మహిళకే వీటిని అప్పగించేలా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read: భారత్‌లో విమానయాన సంస్థలు ఎందుకు దెబ్బతింటున్నాయి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News