Friday, April 26, 2024

ముస్లిం మహిళ, హిందూ పురుషుడిపై మూకల దాడి

- Advertisement -
- Advertisement -

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం రాత్రి ఒక హోటల్‌లో భోజనం చేసి బయటకు వస్తున్న రెండు వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు స్త్రీపురుషులపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరలైంది.

దాదాపు 20 మంది వ్యక్తులు ఆ ముస్లిం మహిళ, హిందూ పురుషుడిని అడ్డగించి ఒక హిందూ పురుషుడితో ఎలా హోటల్‌కు వస్తావంటూ ఆ ముస్లిం మహిళను నిలదీయడం ఆ వీడియోలో కనిపించింది. తమను వదిలివేయాలంటూ ఆ మహిళ రెండు చేతులు జోడించి వారిని వేడుకోగా ఆ గుంపులోని ఒక వ్యక్తి ఇస్లాంపై వారిద్దరికీ లెక్చరిచ్చాడు.

భోజనం చేసి హోటల్ నుంచి బయటకు వస్తున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించిన మూక వారిని చుట్టుముట్టి మరో మతానికి చెందిన వ్యక్తితో ఎందుకు బటయకు వచ్చావంటూ ఆ మహిళను ప్రశ్నించినట్లు ఇండోర్ అడిషనల్ డిపిసి రాజేష్ రఘువంశి తెలిపారు. డిన్నర్ విషయాన్ని తన కుటుంబానికి ముందుగానే చెప్పానంటూ ఆ మహిళ వారికి జవాబిచ్చింది. అయితే..ఆ స్త్రీపురుషులను కాపాడేందుకు ఇద్దరు వ్యక్తులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా మూకలో నుంచి ఎవరో కత్తితో పొడవడంతో అందులో ఒకరు గాయపడ్డారని ఆయన చెప్పారు.

నిందితులపై ఐపిసి సెక్షన్ 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మూకలోని ఏడుగురు వ్యక్తులను గుర్తించడం జరిగిందని, వారిలో ఇద్దరిని(23, 26 మధ్య వయస్కులు) అరెస్టు చేశామని ఎడిసిపి తెలిపారు. మిగిలిన నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News