Tuesday, May 7, 2024

ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి

- Advertisement -
- Advertisement -

Nabha natesh

 

కరోనా సందర్భంగా విధించిన లాక్‌డౌన్‌తో సినీ స్టార్లు అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. అయితే కొందరు సినీ స్టార్లు ఈ సమయంలో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయాన్ని తగిన విధంగా వాడుకోవాలనుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో హీరోయిన్లంతా రకరకాల పనులు పెట్టుకున్నారు. ఎక్కువమంది యోగా, తిండికి ప్రాధాన్యతనిస్తుంటే మరికొంతమంది అందానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఓ బ్యూటీ టిప్ తో మనముందుకొచ్చింది. దాన్ని తను పాటించడమే కాకుండా అందరూ పాటించాలని కోరుతోంది. ఇంతకీ నభా ఏం చేసిందంటే.. రెండు ఎగ్ వైట్స్ (తెల్ల సొన)లో కాస్త కొబ్బరినూనె కలిపి తలకు పట్టించిందట. అంతే ఆమె కురులు అందంగా తయారైపోయాయంటోంది. సముద్రంలో అలల్లా తన కురులు అందంగా మారిపోయాయని, ఈ చిన్న చిట్కాను అందరూ పాటించాలని చెబుతోంది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ అందరూ ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయాలని అంటోంది ఈ హాట్ బ్యూటీ.

Nabha natesh tips for Hair
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News