Tuesday, November 28, 2023

సిఎం గిఫ్ట్ ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

 CM special incentives

 

మన తెలంగాణ/హైదరాబాద్: వైద్యారోగ్య, పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి (ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా) 10 శాతం అదనపు వేతనం, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండబ్లుఎస్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రూ.7500, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, గ్రామాలలో పనిచేస్తున్న కార్మికులకు రూ.5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, వైద్యారోగ్య శాఖలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో వీరికి విధించిన వేతనపు కోతలో మినహాయింపునిస్తూ మరో ఉత్తర్వును కూడా ప్రభుత్వం జారీ చేసింది.

Orders on CM special incentives
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News