Saturday, May 4, 2024

మరోసారి కలిసి నటిస్తూ…

- Advertisement -
- Advertisement -

Naga Chaitanya and Samantha will acting together

 

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. హిట్ మూవీ ‘మజిలీ’ తర్వాత గ్యాప్ తీసుకొని క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేశాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ పూర్తి కాకముందే నాగచైతన్య మరో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చైతూ ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రాజమండ్రిలో జరుపుతున్నారు మేకర్స్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య ఓ సాధారణ మధ్యతరగతి కుర్రాడిలా కనిపిస్తాడని టాక్. అలాగే చైతూ ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్‌గా కూడా అలరిస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు చైతూ. ఇంకా హీరోయిన్ల ఎవరినేది చెప్పలేదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో నాగచైతన్య భార్య సమంత అక్కినేని ఓ గెస్ట్ రోల్ చేయనుందని తాజా సమాచారం. ఇదివరకు విక్రమ్ ‘మనం’ సినిమాలో కూడా చైతూ, సామ్‌లను తీసుకున్నాడు. ఈసారి కూడా వారితో హిట్ కొడతాడేమో. మరి ఈ హిట్ కపుల్ మరో హిట్ అందుకుంటారేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News