Monday, April 29, 2024

థ్రిల్లింగ్ సన్నివేశాలు… పవర్‌ఫుల్ డైలాగ్స్

- Advertisement -
- Advertisement -


కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్‌ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. మునుపెన్నడూ చూడని యాక్షన్ కంటెంట్, నాగార్జున సూపర్ స్టైలిష్‌గా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేస్తూ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విశేష్ తెలిపారు. ట్రైలర్ ప్రధాన పాత్రలని పరిచయం చేయడంతో పాటు కథాంశంపై ఆసక్తిని కలిగించింది.

ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ (నాగార్జున) గ్యాంగ్‌స్టర్ల నుండి ముప్పు ఉన్న తన చెల్లెలు, మేనకోడలిని సంరక్షిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. కథాంశం, కథనం రెండూ ఆసక్తికరంగా వున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కనెక్ట్‌తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా వుంది. ప్రవీణ్ సత్తారు అందరినీ ఆకర్షించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో అతని స్టైలిష్ రోలర్‌కోస్టర్ రైడ్‌ను అందిస్తోంది. నాగార్జున సబార్డినేట్‌గా కనిపించిన సోనాల్ చౌహాన్ గ్లామర్ విందు పంచారు.

నాగార్జున సోదరిగా గుల్ పనాగ్ నటిస్తుండగా, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ కనిపించింది. ఇక ట్రైలర్‌లో ఒక సీరియస్ మిషన్‌లో వున్న నాగార్జున పలికిన డైలాగ్స్ కూడా పవర్‌ఫుల్‌గా వున్నాయి. ఇప్పటివరకూ వున్న అంచనాలని ఈ ట్రైలర్ రెట్టింపు చేసింది.నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్ తో కలిసి పుస్కుర్ రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News