Saturday, April 27, 2024

సుప్రీంను ఆశ్రయించిన ఇద్దరు మణిపూర్ బాధిత మహిళలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించిన  బాధిత మహిళలు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

తమకు జరిగిన అన్యాయంపై నిష్పాక్షిక విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించాలని ఆ ఇద్దరు మహిళలు తమ పిటిషన్‌లో కోరారు. తమ పేర్లు, ఇతర వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు అర్థించారు. మే 4వ తేదీన వెలుగుచూసిన వీడియో ప్రకారం ఇద్దరు గిరిజన మహిళలను మూకలు నగ్నంగా ఊరేగించి, వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాయి.

ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సోమవారం విచారణ జరపనున్నారు. ఆ వైరల్ వీడియోపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలని మణిపూర్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు జులై 20న కోరింది. ఇద్దరు మహిళలను నగ్నంగాఊరేగించిన ఘటనను రాజ్యాంగ, మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనగా సుప్రీంకోర్టు అభివర్ణించింది.

ఈ ఘటనకు సంబంధించి కేంద్రం గత గురువారం సుప్రీంకోర్టుకు సమాధానమిస్తూ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీచేసినట్లు తెలిపింది. ఈ కేసు విచారణను మణిపూర్ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని కూడా కేంద్రం అర్థించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News