Saturday, May 4, 2024

ఇన్ఫోసిస్ అధినేత కాలేజీ అనుబంధం.. ఐఐటి బొంబాయికి రూ 315 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని తన పూర్వపు విద్యాసంస్థ ఐఐటి బొంబాయితో తన అనుబంధాన్ని ప్రగాఢంగా చాటుకున్నారు. ఈ ప్రముఖ విద్యాసంస్థకు రూ 315 కోట్ల విరాళం అందించారు. ఎందరో ఐటి ప్రతిభావంతులకు వేదిక అయిన ఐఐటి ముంబైతో తన 50 ఏండ్ల అనుబంధాన్ని చాటుకుంటూ నిలేకని ఈ దాతృత్వపు ఆత్మీయతను చాటుకున్నారు.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టాకోసం ఈ సంస్థలో విద్యార్థిగా 1973లో చేరారు. తన భవితకు ఈ విద్యాసంస్థ బంగారు బాటలు వేసిందని,ఈ సంస్థ బాగుకు, రాబోయే విద్యార్థితరానికి మేలు చేయాలనే సంకల్పంతో తాను విరాళాన్ని తన బాధ్యతగా అందిస్తున్నట్లు నిలేకని తరఫున ప్రకటన వెలువడింది. ముంబై ఐఐటిలో అత్యంత అధునాతన ప్రపంచ స్థాయి సాధనాసంపత్తిని పెంపొందింపచేసేందుకు తద్వారా ఈ సంస్థ మరింత ప్రామాణికంగా ఉండేందుకు ఈ విరాళాన్ని ఉద్ధేశించినట్లు వివరించారు.

ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలలో పరిశోధనల విస్తృతికి ఐఐటి బొంబాయి ద్వారా మరింతగా ప్రగాఢ టెక్ స్టార్టప్‌ల వ్యవస్థను పెంచి పోషించేందుకు ఈ సాయం దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఓ పూర్వపు విద్యార్థి తమ ఇంతకు ముందటి విద్యాసంస్థకు ఇంత భారీ మొత్తంలో విరాళం అందించడం ఇదే తొలిసారి అని విద్యావేత్తలు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News