Tuesday, April 30, 2024

అంతరిక్షంలో వికసించిన పుష్పం

- Advertisement -
- Advertisement -

అంతరిక్షం లోని భూ కక్షలో గల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పెరిగిన పుష్పం తాలూకు దృశ్యాన్ని నేషనల్ ఎయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) విడుదల చేసింది. మంగళవారం విడుదలైన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని జిన్నియా పుష్ఫంగా పిలుస్తున్నారు. 2016 జనవరి 12 నుంచి ఈ పుష్పం ఫోటో నాసా చిత్రీకరణలోనే ఉంటోంది. వ్యోమగామి స్కాట్ కెల్లి దీని ఫోటో తీయగలిగారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూరగాయలు, మొక్కలు పెంచే సౌకర్యం ఉన్నందున అందులో భాగం గానే ఈ మొక్కను పెంచ గలిగారు.

1970 నుంచి శాస్త్రవేత్తలు అంతరిక్షం లోని మొక్కల పెంపకంపై పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే ఈ ముఖ్యమైన ప్రయోగం మాత్రం అంతరిక్ష కేంద్రంలో 2015 లో వ్యోమగామి జెల్ లిండ్ గ్రెన్ ప్రారంభించారు. ఈ అంతరిక్ష ఉద్యానం కేవలం షో కాదు. కక్షలో మొక్కలు ఏ విధంగా పెరుగుతాయో పూర్తిగా తెలుసుకోడానికి ఈ ప్రయోగం ఎంతో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదీర్ఘకాలం చంద్రుడు, అంగారకుడు తదితర గ్రహాలపై వెళ్లే అంతరిక్షయాత్రల్లో ఉండే వ్యోమగాములకు కావలసిన ఆహారం సమకూర్చడానికి వనరులుగా ఈ మొక్కల పెంపకం ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

నాసా వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో చిక్కుళ్లు, టొమాటో, మిరియాలు వంటివి పండించారు. మరికొన్ని కూరగాయలు, పువ్వులు, వంటివి కూడా త్వరలో అంతరిక్ష కేంద్రం నుంచి వస్తాయన్న విశ్వాసం కలుగుతోంది. ఇప్పుడు కనిపించే జిన్నియా పుష్పం నారింజ రంగు కలిగిన పూరేకులతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆకులు కూడా దట్టంగా విస్తరించి ఉన్నాయి. ఈ పువ్వు వెనుక భూగోళం కూడా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News