Monday, April 29, 2024

సివిల్‌కోడ్ కుదరదు

- Advertisement -
- Advertisement -

అరుణాచల్‌లో బిజెపికి మిత్రపక్షం షాక్

ఇటానగర్ : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)పై అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపికి మిత్రపక్షం ఎన్‌పిపి నుంచి చుక్కెదురైంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో వెనువెంటనే ఈ కోడ్‌ను అమలు చేయడం తమకు సమ్మతి కాదని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది. శనివారం ఎన్‌పిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సివిల్ కోడ్ అమలును వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌పిపి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి పక్నగా బగే ఆదివారం విలేకరులకు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపరమైన విషయాలపై తాము బిజెపితో మిత్రపక్షంగా ఉన్నామని , అయితే సివిల్ కోడ్ వంటి విషయాలలో ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని ఈ పార్టీ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ లికా సాయా చెప్పారు. యుసిసిని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యవర్గం ఏకగ్రీవతీర్మానం చేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు ఉన్న వైవిధ్య బహుళ తెగలు, విభిన్న గిరిజన సమీకరణలు , పటిష్టమైన సాంప్రదాయక, ఆచార వ్యవహారాల ప్రత్యేకతల నడుమ యుసిసిని తాము ఆహ్వానించలేమని ఈ పార్టీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News