Tuesday, April 30, 2024

మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశ వ్యాప్తంగా అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్  : మోడీ తొమ్మిదేళ్లు పాలనపై దేశ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర ంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నామని, ప్రజల్లో పెద్ద స్పందన కనిపిస్తుందన్నారు. కరోనా తర్వాత పెద్ద పెద్ద దేశాలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నా మోడీ నాయకత్వంలో మన దేశంలో ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు.

సిఎం కెసిఆర్ కుటుంబం, పార్టీ నాయకులు, తెలంగాణా వనరులను, భూములను దోచుకుంటున్నారన్నారు. అట్టడుగున ఉన్న నిరు పేదలను ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నామని, పేదలకు , రైతులకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తెచ్చిన్నామన్నారు. అన్ని విధాలా రైతులను ముందుకు తీసుకురావాలని నరేంద్రమోడీ ప్రభుత్వం యోచన, డిఏపి, యూరియాలపై దాదాపు నా లుగు వేల రూపాయల సబ్సిడి ఇస్తున్నామన్నారు. ఇలా ఏడాదికి ఎకరాకు రూ. 25వేలు లబ్ధి కేంద్రం తరపున వస్తుందన్నా రు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డ్రిప్ మైనర్ ఇరిగేషన్‌కు ఎలా ంటి సబ్సిడి లేదన్నారు.

విద్యుత్ వినియోగంలో తక్కువ ఖర్చు కోసం ఎల్‌ఈడి లైట్లు ఇస్తున్నామన్నారు. జాతీయ రహదారిలపై లైటింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతుందన్నారు. చించోలి రోడ్‌కు మయూరి పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులే అన్నారు. అమృత్ పథకం ద్వారా మహబూబ్‌నగర్ మున్సిపాల్టీకి రూ. 160 కోట్లను ఇచ్చిందన్నారు. ఓట్లు దగ్గరకు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌కు పాలమూరు గుర్తుకు వస్తుందన్నారు. ఇక్కడ వలసలు ఆగిపోయాయని కెసిఆర్, కెటిఆర్‌లు అబద్ధం చెబుతున్నారన్నారు.

తెలంగాణ వచ్చాక పాలమూరుకు ఒరిగింది ఏమి లేదన్నారు. పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది పాలమూరు లో నాలుగు పాత ప్రాజెక్టులు కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, బీమా , కల్వకుర్తి, ఎత్తిపోతల పథకాలు, ఎక్కడ వేసిన గొంగడి అ క్కడే అన్న చందంగా ఉందన్నారు. కోయిల్‌సాగర్‌లోని కాల్వలు మరమ్మతులకు నోచుకోలేదన్నారు. పాలమూరు … రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎంతటి నిర్లక్షం చేస్తోందో తెలుసన్నారు. రోజూ ముంబైకి బస్సు పోతుందని, దాన్ని చూడటానికి తండ్రి, కొడుకులను పిలిస్తే వారికి టైం లేదన్నారు. తెలంగాణా వచ్చాక వలసలు ఇంకా పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News