Friday, April 26, 2024

వ్యాక్సిన్ల కోసం భారత్ సహాయం కోరిన నేపాల్

- Advertisement -
- Advertisement -

Nepal seeks India's help to procure Covid vaccines

 

ఖాఠ్మండ్: కొవిడ్19కు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల కోసం భారత్ సహాయాన్ని నేపాల్ కోరిందని ఆ దేశ వార్తా సంస్థ ఖాఠ్మండ్ పోస్ట్ పేర్కొన్నది. తమ దేశంలోని 20 శాతం మందికి అవసరమైన వ్యాక్సిన్లను వీలైనంత త్వరగా అందించాలని నేపాల్ ప్రభుత్వం లేఖ రాసిందని ఆ పత్రిక తెలిపింది. నేపాల్ మరికొన్ని దేశాలకు కూడా వ్యాక్సిన్ల కోసం లేఖలు రాసింది. వాటిలో చైనా,రష్యా, యుకె, అమెరికా ఉన్నాయి. వేర్వేరు దేశాల్లో 15 వ్యాక్సిన్లు చివరిదశ ట్రయల్స్‌లో ఉన్నాయి. తమ ప్రభుత్వం ఆయా దేశాలతోపాటు ఔషధ కంపెనీలకు లేఖలు రాసిందని నేపాల్ కొవిడ్19 వ్యాక్సిన్ సలహా కమిటీ కో ఆర్డినేటర్ డా॥శ్యామ్‌రాజ్ ఉప్రేటీ తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ ప్రాధాన్యతా దేశాల్లో నేపాల్ ఉన్నదని గత నెలలో ఆ దేశంలో పర్యటన సందర్భంగా భారత విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష్‌వర్ధన్ ష్రింగ్లా హామీ ఇచ్చారు. ఆ దేశంలోని 52 శాతం జనాభాకు టీకాలు వేయాలంటే రూ.4800 కోట్లు అవసరమవుతాయని అంచనా.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News