Friday, April 26, 2024

మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి..

- Advertisement -
- Advertisement -

Nirbhaya accused

 

న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఢీల్లీ పాటియాల హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. సోమవారం వాదనలు విన్న పాటియాల హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జీ ధర్మేందర్ రానా నలుగురు దోషులకు ఉరిశిక్ష తేదిని ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించారు. మార్చి 3 ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తీహర్ జైలులో నలుగురు దోషులు ముకేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌లను ఒకేసారి ఉరితీయనున్నారు. కాగా, జనవరి 22, ఫిబ్రవరి 1న రెండు సార్లు దోషులకు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ, న్యాయపరమైన అవకాశాలు పెండింగ్‌లో ఉన్నందున వాటిపై కోర్టు స్టే విధించింది.

New Death Warrant Issued to Four Nirbhaya Convicts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News