Sunday, April 28, 2024

ఆరోగ్యసేతులో కొత్త ఫీచర్

- Advertisement -
- Advertisement -

new features of aarogya setu app

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి మనల్నిమనం రక్షించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్ లో ‘ఓపన్ ఎపిఐ’ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా సంస్థలు, తమ ఉద్యోగులు, వ్యాపార నిమిత్తం వచ్చే  ఇతర వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అయితే దీని వల్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని యాప్ తెలిపింది. కాగా, దేశంలో ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా ఆరోగ్యసేతు యాప్ ను  వాడుతున్నారు. అటు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజా సంరక్షణ కోసం కేంద్రం ఆరోగ్య సేతు యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ యాప్ అందరూ తమ ఫోన్‌లో ఉంచుకోవాలని, ప్రయాణం చేసే సమయంలో ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

new features of aarogya setu app

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News