Saturday, May 4, 2024

దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India's COVID 19 cases tally crosses 30 lakh mark

న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 30 లక్షలు దాటాయి. గత 24గంటల్లో 69,239 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 912 మరణాలు నమోదయయ్యాయి. ఇప్పటివరకు ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,44,941 దాటాయి. వీటిలో 7,07,668 యాక్టివ్ కేసులుండగా… ఈ మహమ్మారి నుంచి 22,80,567 మంది బాధితులు నయమై కోలుకున్నారు. 24గంటల్లో 57,989 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 56,706 మంది కరోనా వైరస్ తో మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆగస్టు 22 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 3,52,92,220 ఉండగా, ఇందులో నిన్న పరీక్షించిన 8,01,147 నమూనాలు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది. అటు మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 6,61,942 మందికి కరోనా సోకింది. ఈ వైరస్ వైరస్ బారినపడి 22,292 మంది చనిపోయారు. 4,80,114 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 1,69,516 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, బిహార్ లలో కరోనా విస్తరణ వేగంగా జరుగుతోంది.

 

India’s COVID 19 cases tally crosses 30 lakh mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News