Wednesday, May 22, 2024

రైతులకు బిజెపి సమస్యగా మారింది: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Niranjan Reddy Wrote Letter To Union Minister

 

హైదరాబాద్: సమస్యలు లేని రైతులకు బిజెపి సమస్యగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 4569 కొనుగోలు కేంద్రాలు మంగళవారానికి ప్రారంభించామన్నారు. యాసంగి పంటను కేంద్రం కొంటదా? కొనదా? అనేది చెప్పమంటే చెప్పడానికి బిజెపి నేతలకు చేతకావడం లేదన్నారు.  కొనుగోలు కేంద్రాల వద్దకు పోయి కొనుగోలు చేయాలని పార్టీ అధ్యక్షుడు వెళ్లడం హస్యస్పదంగా ఉందన్నారు. బిజెపికి సిగ్గు శరం ఉందా? పంట గురించి క్లారిటీ ఉందా? అని అడిగారు. రైతులకు ఉరితాళ్ళు పెడుతున్న పార్టీ బిజెపి అని మండిపడ్డారు.

రైతుల దగ్గరకు వెళ్లి ఆందోళన చేసేందుకు బిజెపికి ఏం అర్హత ఉందన్నారు. నెలలపాటు రైతులు రోడ్లపై ఆందోళన చేసిన ఘనత బిజెపికి చెందుతుందన్నారు. కొత్త తరాలకు ఉపాధి లేకుండా చేస్తున్న పార్టీ బిజెపి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపి నేతలు సుంటలు, కేంద్రం చెప్పిన విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నిరంజన్ దుయ్యబట్టారు. యాసంగిలో పండే పంటలే బాయిల్డ్ రైస్ వడ్లు అని అదే విషయం తాము రైతులకు చెబుతున్నామన్నారు. కొనుగోళ్ల సందర్భంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయని, అవి కూడా కేంద్రమే చెప్పిందన్నారు.  రైతులను ఆందోళనకు గురి చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. కడుపు మండినోడు ఏమైనా పట్టుకొని ఆందోళన చేస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News