Thursday, May 23, 2024

ఆలయాల కార్యకలాపాల్లో కోర్టు జోక్యం చేసుకోదు: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

TTD
న్యూఢిల్లీ: తిరుమలలో పూజలు, కైంకర్యాలు వగైరా సరిగా జరగడంలేదని ఓ భక్తుడు వేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణను ముగించింది. విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన తిరుమల తిరుపతి దేవస్థానం న్యాయవాది అన్ని సవ్యంగానే జరుగుతున్నాయని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం చివరికి ఆలయాల్లో రోజువారీ కార్యకలాపాలను కోర్టులు చూడవని, వాటిని ఆగమశాస్త్ర పండితులే చూసుకుంటారని అభిప్రాయపడింది. ఒకవేళ ఆలయ కార్యకలాపాల్లో లోపాలున్నట్లు భావిస్తే స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. పిటిషనర్ పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేసినట్లు అనిపిస్తోందని కూడా ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ఈ పిటిషన్ ను రిట్ గా కూడా కోర్టు స్వీకరించలేనని తెలిపింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎనిమిది వారాల్లో సమాధానం ఇవ్వాలని తిరుమల దేవస్థానాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News