Thursday, May 2, 2024

వీధి వ్యాపారులకు రూ.5వేల కోట్ల రుణాలు

- Advertisement -
- Advertisement -

Nirmala Sitharaman

 

న్యూఢిల్లీ: వలసకార్మికులకు వచ్చే రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ రెండో ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. 8 కోట్ల మంది వలస కార్మిలకులకు రూ.3500 కోట్లు విలువైన ఉచిత రేషన్ సరుకులు. కార్డులేని వలస కార్మికులకు కూడా బియ్యం, పప్పుధాన్యాలు. వలస కార్మికులను గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఉద్యోగులకు ఈఎస్ఐ తప్పనిసరి. 10మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్ఐ సౌకర్యం. సంవత్సరానికి ఒకసారి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు. వలస కార్మికుల సంక్షేమ పథకాల పోర్టబిలిటీ. ఆగస్టు నెల నుంచి వన్ నేషన్- వన్ రేషన్ అమలు. వలస కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నా సంక్షేమ పథకాలు వర్తింపు. మార్చి 2021 నాటికి వందశాతం దేశవ్యాప్తంగా రేషన్ పోర్టబిలిటీ. కార్డులేని వారికి మరో రెండు నెలలపాటు ఉచితంగా రేషన్. ప్రతి నెల 5 కిలోల గోధుమలు లేదా బియ్యం, కిలో పప్పు. దీంతో 8 కోట్ల మందికి లబ్ఢి కలుగుతుంది.

ప్లాట్ ఫాం వర్కర్లకు సాంఘిక భద్రత పథకం. వలస కార్మికులు, పట్టణ పేదలకు పిఎం ఆవాస్ యోజన కింద తక్కువ కిరాయికే ఇళ్లు. ముద్రాశిశు రుణాలు తీసుకున్న వారికి 12 నెలల పాటు 2 శాతం రడ్డీ రాయితీ. ముద్రాశిశు రుణాలు తీసుకున్న 3కోట్ల మందికి లబ్ధి. ఫుట్ పాత్ పై వ్యాపారాలు చేసుకునేవారికి రూ. 5వేల కోట్లతో రుణాలు. దీంతో మొత్తం 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి. డిజిటల్ పేమెంట్ చేసేవారికి మరిన్ని రాయితీలు. క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీం 2021 మార్చి వరకు పొడగింపు. కాంపా నిధుల ద్వారా ఆదివాసీ యువతకు ఉద్యోగ కల్పన. రూ.6వేల కోట్ల కాంపా నిధుల ద్వారా ఆదివాసీ యువతకు ఉద్యోగ కల్సన. వచ్చే నెలలో క్యాంపా పథకం ప్రారంభం. రైతుల కోసం నాబార్డుకు రూ.30వేల కోట్ల అదనపు అత్యవసర నిధులు.

Nirmala Sitharaman Press Meet on Economic Package

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News