Friday, April 26, 2024

క్రీడల అభ్యున్నతికై సంపూర్ణ సహకారం అందిస్తా: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగే మహిళా సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పరేడ్ గ్రౌండ్ లో సిద్ధిపేట సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ తెలంగాణ రాష్ట్ర మహిళా సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు మూడు రోజులుగా జరిగాయి. ఈ పోటీల్లో 20 జిల్లాలు పాల్గొనగా, వీటిలో నిజామాబాద్ జిల్లా విన్నరప్, సిద్ధిపేట జిల్లా రన్నరప్, హైదరాబాదు జిల్లా మూడవ స్థానంలో నిలిచాయి. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్ లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన చాంపియన్స్ కు బహుమతుల అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒలింపిక్స్ క్రీడలను ప్రోత్సహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిందన్నారు. సాఫ్ట్ బాల్ క్రీడ ఒలింపిక్ క్రీడ అని, ఈ క్రీడలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు చేర్చినట్లు తెలిపారు.
క్రీడల్లో గెలిచిన విన్నర్స్, రన్నర్స్, మూడవ స్థానంలో నిలిచిన క్రీడాకారిణిలకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించిన మేరకు రాష్ట్ర అసోసియేషన్ తరపున ప్రతిపాదనలు పంపిస్తే అవసరమైన కోచ్ కల్పన, బడ్జెట్ విషయంలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు.

Nizamabad won women softball state championship trophy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News