Monday, May 6, 2024

శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం లేదు: ఫడ్నవిస్

- Advertisement -
- Advertisement -

No intention of joining hands with Shiv Sena

ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని లేదా శివసేనతో చేతులు కలపాలన్న ఉద్దేశం తమకు లేదని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం స్పష్టం చేశారు. పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు శివసేన ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీ (ఎంవిఎ)ప్రభుత్వంపై అంత ఆనందంగా లేరని, రాష్ట్ర ప్రభుత్వం తన నిష్క్రియాత్మకత వల్లనే తనకు తాను కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నాకు ఇంటర్వూకు సంబంధించి శివసేన ఎంపి సంజయ్ రౌత్‌తో తాను సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చెలరేగడంపై మాట్లాడుతూ ఈసమావేశానికి రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు.

ఇంటర్వ్యూకు తాను కొన్ని షరతులపై అంగీకరించానని చెప్పారు. ఇంటర్వూ ఎడిట్ కారాదని, ఇంటర్వూకు తాను తన స్వంత కెమెరా తెచ్చుకుంటానని తదితర షరతులు విధించినట్టు తెలిపారు. అందువల్ల తాము క్షేత్రస్థాయి చర్చించడానికి సమావేశమయ్యామని వివరించారు. ఈలోగా రౌత్ కూడా వేరేగా పాత్రికేయులతో మాట్లాడారు. తాను ఫడ్నవిస్ శత్రువులం కామని, ఈ సమావేశం గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ముందుగానే తెలుసని చెప్పారు. అయినా రౌత్‌పై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రచారం కోసం పతాక శీర్షికలకెక్కడానికి తొందరపడుతున్నారని వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై శివసేన తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News