Saturday, April 27, 2024

కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవు

- Advertisement -
- Advertisement -
No proposal for formation of new states are under consideration
లోక్‌సభలో కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ: కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద పరిశీలనలో లేవని కేంద్ర హోంశాఖ మంగళవారం స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు, సంస్థలనుంచి అలాంటి డిమాండ్లను ఎప్పటికప్పుడు స్వీకరించినప్పటికీ రాష్ట్రాలను విభజించే ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద లేవని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో చెప్పారు. తమిళనాడు సహా దేశంలో ఏ రాష్ట్రాన్నైనా విభజించే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందా అని డిఎంకెకు సభ్యులు టిఆర్ పారివేందర్, ఎస్ రామలింగం అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పలువురు వ్యక్తులు, సంస్థలనుంచి డిమాండ్లు, అభ్యర్థనలు ఎప్పటికప్పుడు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మన దేశ సమాఖ్య స్ఫూర్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్రప్రభుత్వం కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ముందుకెళ్తుందని చెప్పారు. ఇప్పటికైతే అలాంటి ప్రతిపాదనలేవీ కేంద్రప్రభుత్వం వద్ద లేవని మంత్రి స్పష్టం చేశారు.

No proposal for formation of new states are under consideration

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News