Saturday, April 27, 2024

పార్లమెంటు ప్రతిష్టంభనను సామరస్యంగా పరిష్కరించుకోండి

- Advertisement -
- Advertisement -
Vice President Venkaiah Naidu urges government
ప్రభుత్వం, ప్రతిపక్షాలకు వెంకయ్య సూచన

న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటులో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను కలిసికట్టుగా చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రభుత్వం, ప్రతిపక్షాలకు సూచించారు. మంగళవారం రాజ్యసభ తొలిసారి వాయిదా పడిన తర్వాత వెంకయ్య నాయుడు ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, సభా నాయకుడు పీయూష్ గోయల్‌తో సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పార్లమెంటులో ప్రతస్తుతంం నెలకొన్న స్రతిష్టంభనను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షానికి ఉపరాష్ట్రపతి సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత నెల 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి దాదాపు రెండు వారాలుగా ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు పెద్దగా నిర్వహించకుండానే వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. పెగాసస్ వ్యవహారం, రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పెగాసస్ గూఢచర్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కూడా ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

Parliamentary stalemate Settle in harmony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News