Friday, May 10, 2024

చంద్రబాబు అరెస్ట్ గురించి పట్టించుకునే సమయం లేదు

- Advertisement -
- Advertisement -

చంద్రబాబు అరెస్ట్ వార్తలు వస్తే టివి చానెల్ మారుస్తున్నా
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ గురించి తనకు పట్టించుకునే సమయం లేదని, రానున్న తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ గురించి మీడియాలో వార్తలు వచ్చినా తాను చూడటం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్తలు వస్తే టివి చానెల్ మారుస్తున్నానని వెంకటరెడ్డి చెప్పారు. ఆంధ్రా రాజకీయాల గురించి తనకు అవసరం లేదని, మాది మాకే ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News