Home టెక్ ట్రెండ్స్ రూ.13 వేలకే నోకియా స్మార్ట్ టివి

రూ.13 వేలకే నోకియా స్మార్ట్ టివి

Nokia Smart Tv Launched in India

హైదరాబాద్: పండగ సీజన్ దగ్గరపడుతుండటంతో పలు ఈ- కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ‘బిగ్ బిలియన్ డేస్’లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనేక వస్తువులను కస్టమర్లకు చౌక ధరకు అందిస్తోంది. ఇందులో భాగంగానే నోకియా 32, 43, 50, 55, 65 అంగుళాల స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 32 అంగుళాల స్మార్ట్ టి.వి ధర రూ 12,999గా నిర్ణయించగా… 65 అంగుళాల టి.వి ధర రూ. 59,999గా ఉంది. ఈ స్మార్ట్ టివీలను ఇండియాలోనే తయారుచేసినట్టు నోకియా సంస్థ పేర్కొంది. దసరా, దీపావళి పండుగలకు ముందే ఈ సేల్‌లో భారీ ఆఫర్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే.

ఈ నోకియా టివిల అద్భుత ఫీచర్లు ఉన్నాయి. 50, 55, 65-అంగుళాల మోడళ్లలో 48డబ్ల్యూ సౌండ్ పవర్ (30డబ్ల్యూస్పీకర్లు + 18డబ్ల్యూ ట్వీటర్లు), 32, 43-అంగుళాల మోడళ్లలో 39డబ్ల్యూ సౌండ్ పవర్ (24డబ్ల్యూ స్పీకర్లు +15డబ్ల్యూట్వీటర్లు) ఉన్నాయి. నోకియా స్మార్ట్ టివిలు ఆండ్రాయిడ్ 9.0, క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తాయని సంస్థ వెల్లడించింది. అల్ట్రా హెచ్డీ రేంజ్ 43, 50, 55, 65- అంగుళాల టివీల్లో 2.జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా, ఫుల్ హెచ్ డి వేరియంట్లలో 1.5 జిబి ర్యామ్, 8జి.బి ఇంటర్నల్ స్టోరేజ్ ఉందని నోకియా వెల్లడించింది. ఈ టీవీల్లో మూడు యుఎస్ బి పోర్ట్, రెండు హెచ్ డిఎమ్ఐ పోర్ట్‌తో పాటు బిల్ట్ ఇన్ వైఫై , బ్లూటూత్ వంటి జబర్దస్త్ ఫీచర్లు ఈ టివీల్లో ఉన్నాయి.

Nokia Smart Tv Launched in India