Saturday, April 27, 2024

నిర్వాసిత గ్రామ పేదలను ఆదుకుంటున్న ఎన్టీపీసీ

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసిత గ్రామాలకు చెందిన పేదలను సిఎస్‌ఆర్ ఆధ్వర్యంలో ఆదుకుంటూ సేవా కార్యక్రమాలను చేపడుతుందని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కాకతీయ ఆడిటోరియంలో ఎన్టీపీసీ పరిధిలోని నిర్వాసిత గ్రామాలకు చెందిన 95 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బ్యాటరీ సైకిళ్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి పరికరాలను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం సిఎస్‌ఆర్ ఆధ్వర్యంలో నిర్వాసిత గ్రామాలలో రోడ్లు, తాగునీరు, వైద్య సేవలతోపాటు విద్య అభివృద్ధి కృషి చేస్తుందని అన్నారు. పేదలను ఆదుకుంటూ గొప్ప సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగులకు పెన్షన్ అందజేస్తూ అన్ని విధాల ఆదుకుంటూ గొప్ప సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని అన్నారు.

సిఎం కెసిఆర్ దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తూ అన్ని విధాల ఆదుకుంటున్నారని అన్నారు. అంతేగాక పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ జిఎం ఎసి ఠాకూర్, హెచ్‌ఆర్ ఎజిఎం బిజయ్‌కుమార్ సిక్దర్, మున్సిపల్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కల్వచర్ల క్రిష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, సిఎస్‌ఆర్ అధికారి విశాల్‌తోపాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News