Friday, April 26, 2024

రెండోరోజు ముగిసిన ఆట.. భారత్ పై 51 పరుగుల ఆధిక్యంలో కివీస్‌..

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్‌టన్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. దీంతో భారత్ పై న్యూజిలాండ్ 51 పరుగలు ఆధిక్యాన్ని సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(89), రాస్ టేలర్(44)లు రాణించారు. ప్రస్తుతం క్రీజులో వాట్లింగ్(14), కొలిన్ గ్రాండ్ హోమ్(4)లు ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు వికెట్లతో రాణించగా.. మహ్మద్ షమి, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో 122/5తో రెండో రోజు ప్రారంభించిన భారత్ మరో 43 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లో వైస్‌ కెప్టెన్‌ రహానే(46), మయాంక్‌ అగర్వాల్‌(34), షమీ(21), పృధ్వీ షా(16), పూజారా(11)లు రెండంకెల స్కోరు చయగా, మిగతా బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 68.1 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో సౌథీ, జమ్సీన్ చెరో నాలుగు వికెట్లు తీయగా బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.

NZ lead by 51 runs against IND in 1st Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News