Sunday, April 28, 2024

సిద్దిపేటలో ఎయిర్‌గన్‌ పేలి యువకుడు మృతి..

- Advertisement -
- Advertisement -

One Killed as Air Gun fired in Siddipet

సిద్దిపేట: ఎయిర్‌గన్‌ పేలి యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాఖపూర్‌లో చోటుచేసేకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన ముసాఫ్‌ ఖాన్ స్నేహితుడిని కలిసేందుకు బుధవారం సలాఖపూర్‌ గ్రామానికి వెళ్లాడు. అక్కడ రాత్రి సమయంలో 8మంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే, ముసాఫ్‌ ఖాన్ చేతిలో ఉన్న ఎయిర్‌గన్‌ ప్రమాదవశాత్తు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

One Killed as Air Gun fired in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News