Monday, April 29, 2024

ఆన్‌లైన్ మోసం నుంచి ఇలా రక్షించుకోండి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెరుగుతున్న కొద్దీ బ్యాంకింగ్ మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. వివిధ రకాల మోసాల కేసులు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తిని బ్యాంకు అధికారులమని చెప్పి నేరగాళ్లు సుమారు రూ.10 లక్షలు మోసం చేశారు. ఇలాంటి కేసులు తరచుగా జరుగుతున్నాయి. ఎస్‌బిఐ తన ఖాతాదారులను ఈ విషయంలో అప్రమత్తం చేసింది. మోసం బారిన పడకుండా ఉండేందుకు పలు మార్గాలను సూచించింది. ఎస్‌స్‌బిఐ బ్యాంకింగ్ మోసం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని చర్యల గురించి కూడా చెప్పింది.

ఎస్‌బిఐ సూచనలు: 

కస్టమర్లు ఇమెయిల్‌లో వచ్చిన లింక్‌ల ద్వారా బ్యాంక్ వెబ్‌సైట్‌ను వెబ్‌సైట్‌ను తెరవవద్దు. కావాలంటే నేరుగా బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మోసం లేదా క్లోన్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయడానికి డొమైన్ పేరు, యుఆర్‌ఎల్‌ని బాగా పరిశీలించండి.
పాస్‌వర్డ్ లేదా పిన్ కోసం అడిగే ఏ ఇమెయిల్‌ను క్లిక్ చేయడం గానీ, చూడడం గానీ చేయకూడదు. అటువంటి వాటిపై వెంటనే బ్యాంకులకు ఫిర్యాదు చేయండి.
బ్యాంక్ లేదా పోలీసులు మిమ్మల్ని బ్యాంకింగ్ లేదా కార్డ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడగరు.
సైబర్ కేఫ్‌లు లేదా షేర్ చేసిన పిసిల నుండి మీ ఖాతాను లాగిన్ చేయవద్దు.
మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోండి. దీంతో వైరస్ ఎటాక్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.
మీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫైల్, ప్రింటింగ్ వంటి వాటిని నిలిపివేయండి.
మీరు పిసిని ఉపయోగించకుంటే దాన్ని లాగ్ ఆఫ్ చేయండి.
బ్యాంకింగ్ లాగిన్ వివరాలను బ్రౌజర్‌లో సేవ్ చేయకూడదు.
మీ బ్యాంకింగ్ ఖాతా, లావాదేవీలను తరచూ తనిఖీ చేస్తూ ఉండండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News