Monday, April 29, 2024

నీట్, జెఇఇ సహా అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లోనే కోచింగ్

- Advertisement -
- Advertisement -

పోటీ పరీక్షతో ఇంటర్ పరీక్షలకు
సిద్ధమవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
గ్రామీణ ప్రాంతాలలో వేదిస్తున్న నెట్‌వర్క్ సమస్యలు

Online coaching for NEET JEE
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా పరిస్థితులతో విద్యాసంస్థలను మూసివేయడంతో విద్యార్థులందరూ సొంతూళ్లలో ఉంటూ నీట్, జెఇఇ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎంపిసి, బైపిసి విద్యార్థులు ఎంసెట్, నీట్, జెఇఇ మెయిన్, అడ్వాన్సుడ్ వంటి ప్రవేశ పరీక్షలకు పలు కోచింగ్ కేంద్రాలలో శిక్షణ తీసుకుంటారు. ఎక్కువగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాల్లోని కళాశాలలు, మరికొన్ని సంస్థల్లో శిక్షణ పొందుతారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు కోచింగ్ తీసుకోలేని పరిస్థితి నెలకొనడంతో పలు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణను ప్రారంభించాయి. రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణతో ప్రభుత్వం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేసింది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత పరీక్షల నిర్వహణ లేదా రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ రెండవ సంవత్సరం సైన్స్ విద్యార్థులు నీట్,జెఇఇ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలతో పాటు ఇంటర్ సిలబస్ కూడా చదవాల్సి వస్తుంది. కళాశాలలు, కోచింగ్ సంస్థలు ఆన్‌లైన్‌లోనే విద్యార్థులను ఇంటర్ పరీక్షలను సిద్ధం చేస్తూనే పోటీ పరీక్షలను శిక్షణ అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్)కు దాదాపు 2.40 లక్షలు, జెఇఇ మెయిన్‌కు 75 వేలు, నీట్‌కు సుమారు 60 వేలమంది పోటీపడతారు.

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లులేక ఆన్‌లైన్ కోచింగ్‌కు దూరం

పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు పొందాలంటే తప్పనిసరిగా కోచింగ్ ఉండాల్సిందే అనే పరిస్థితి ఉంది.ముఖ్యంగా ఎంసెట్, జెఇఇ, నీట్ వంటి పోటీ పరీక్షలకు పలు కోచింగ్ సంస్థలు, కళాశాలలు ఆన్‌లైన్ విధానంలో కోచింగ్ ఇస్తున్నాయి. వివిధ సాఫ్ట్‌వేర్లను వినియోగించుకొని ఆయా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులు నడుపుతున్నాయి. వీటిని వినియోగించుకోవాలంటే విద్యార్థులకు కచ్చితంగా కంప్యూటర్‌గానీ, ల్యాప్‌టాప్‌గానీ ఉండాలి. రాష్ట్రంలో చాలామంది విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేక ఆన్‌లైన్ కోచింగ్‌ను, ఆన్‌లైన్ తరగతులకు దూరమవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ నెట్‌వర్క్ సమస్యతోపాటు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు లేకపోవడంతో సన్నద్ధం కాలేకపోతున్నారు. స్మార్ట్‌ఫోన్లు ఉన్నా ప్రస్తుత సమయంలో ఎక్కువమంది ఇంటర్నెట్ ఉపయోగిస్తుండడంతో నెట్‌వర్క్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కొత్తగా వైఫై కనెక్షన్ తీసుకుందామన్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యార్థులకు స్పీడ్‌గా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేకపోవడం వల్ల స్మార్ట్‌ఫోన్లతో సరిగ్గా చదవలేకపోతున్నారు. దాంతో ఆన్‌లైన్ శిక్షణ అందుబాటులో ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేక సతమతమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News