Saturday, April 27, 2024

డిమాండ్ గల పంటలే పండించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఆలుగడ్డకు మంచి గిరాకీ ఉంది

రైతులు ఆలుగడ్డ పంటపై దృష్టి
పెట్టాలి 2.5 లక్షల ఎకరాల్లో
దానిని సాగు చేయాల్సిన
అవసరం ఉంది ఎనిమిదేళ్లల్లో
ప్రభుత్వం వ్యవసాయంపై
రూ.3.75లక్షల కోట్లు ఖర్చు
చేసింది కొహెడ పండ్ల
మార్కెట్‌లో ఆలుగడ్డ కోసం శీతల
గిడ్డంగులు రాష్ట్ర వ్యవసాయ శాఖ
మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి
పచ్చిరొట్ట విత్తనాల సాగు
పెంచాలి: మంత్రి హరీశ్ రావు

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటలపై రైతాంగం శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంతోపాటు, హైదరాబాద్ నగరంలో ఆలుగడ్డ పంటకు విపరీతమైన డి మాండ్ ఉందని, ఆ మేరకు ఉత్పాదన లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి ఆలుగడ్డను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీన్ని గుర్తించి మన ప్రాంతంలో ఆలుగడ్డ సేద్యంపై రైతులు దృష్టిపెడితే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మం డలం గోకుల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వానాకాలం పంటల సాగు సన్నాహక సమావేశానికి మంత్రి హరీశ్‌రావుతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి పంటల సాగుపై రైతులకు దిశానిర్దేశం చేశారు.

65 నుంచి 70 రోజుల్లోనే లాభాలు వచ్చే పం ట ఆలుగడ్డ అన్నారు. తెలంగాణలో ఆలుగడ్డను ప్రజలు విస్తారంగా తింటారు. కానీ, ఇక్కడ కేవ లం ఐదారు వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, గుజరాత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనకు అవసరమయ్యే ఆలుగడ్డను మనమే పండించుకోవాలంటే దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో ఈ పంట సా గు చేయాల్సిన అవసరముందన్నారు. వ్యవసా య, ఉద్యాన శాఖలు పట్టుదలగా తీసుకుని రైతులతో సాగు చేయించాలని సూచించారు. విత్తనకొరత కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.

కొహెడ మార్కెట్‌లో ఆలుగడ్డ కోసం గిడ్డంగులు

మన రాష్ట్రంలోనే ఆలుగడ్డ సాగుచేసి వాటిని శీతల గిడ్డంగుల్లో భద్రపరిస్తే విత్తనాలకు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. అందుకోసం అవసరమైన శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 167 ఎకరాల విస్తీర్ణంలో కొహెడలో నిర్మించే అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్‌లో 10 ఎకరాలు శీతల గిడ్డంగుల కోసం కేటాయించామన్నారు. దీని ద్వారా ఆలుగడ్డ పండించే రైతులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. స్థానికంగా డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.

పచ్చిరొట్ట విత్తనాల సాగు పెంచాలి

పచ్చిరొట్ట విత్తనాల సాగును పెంచి, నేలను సారవంతం చేసుకుని అధికంగా పంటల దిగుబడులు సాధించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రంలో అతి తక్కువగా వరి సాగు చేసిన్ జిల్లా సంగారెడ్డి మాత్రమేనన్నారు. జిల్లా రైతులు వాణిజ్య పంట్ల సాగు చేస్తున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదని, కానీ, కెసిఆర్ సిఎం అయ్యాకా.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మంజీరా నదిపై 12 చెక్ డ్యాంలను నిర్మించామని తెలిపారు.

కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరెంటు కుడా ఇవ్వలేని వారు.. 24 గంటలూ విద్యుత్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. రైతు బంధు కాపీ కొట్టి కేంద్రం పిఎం కిషన్ యోజన పేరుతో ఇస్తున్నారని దెప్పిపొడిచారు. తెలంగాణ రైతు ప్రయోజల కోసం బావుల వద్ద మీటర్లు పెట్టకుండా చూస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పి చైర్‌పర్సన్ మంజుశ్రీ, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి హనుమంత్, కలెక్టర్ హన్మంత రావు, జడ్పిటిసి, ఎంపిపిలు, ఎఎంసి ఛైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా, మండల కోఆర్డినేటర్లు, ఆత్మ చైర్మన్లు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News