Thursday, May 9, 2024

బండికి బుర్రుందా?

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుపై ఆయనవి మతిలేని మాటలు

భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు యంత్రాలన్నీ
కేంద్రం ఆధీనంలోని బిహెచ్‌సిఎల్‌వే ఆ సంస్థను
తప్పుపట్టడం కేంద్రాన్ని వెలేత్తి కదా?
బండి సంజయ్ పరోక్షంగా కేంద్రాన్ని
విమర్శిస్తున్నారు ఆరోపణ చేసేముందు సమగ్ర
వివరాలు తెలుసుకొని చేస్తే బాగుండు అన్ని
రాష్ట్రాలూ అప్పులు చేస్తాయి సరిగ్గా తిరిగి
చెల్లిస్తున్న రాష్ట్రం మాత్రం తెలంగాణాయే
టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు
ప్రజలు, రైతుల కోసమే తెలంగాణ భవన్
మీడియా భేటీలో మంత్రులు పువ్వాడ అజయ్,
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పు వ్వాడ అజయ్‌కుమార్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌లు బి. వినోద్‌కుమార్‌లు ఘాటుగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వా రు ఖండించారు. భద్రాద్రిపై ఆయనవన్ని తు ప్పు మాటలని మండిపడ్డారు. బండికి కనీసం బుర్రా అయినా ఉందా? ఈ సందర్భంగా వా రు ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పువ్వాడ, వినోద్‌కుమార్‌లు మాట్లాడు తూ, బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కోసం ఇచ్చిన యంత్రాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని బిహెచ్‌ఇఎల్ సంస్థవేనని అన్నారు. మ రి ఆ సంస్థను తప్పుబడితే కేంద్రాన్ని తప్పుబట్టినట్లే కదా! అని వారు ప్రశ్నించారు. అసలు బండి సంజయ్ చేసిన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై కాకుండా పరోక్షంగా కేంద్రంపై చేసినట్లుగా ఉందని వినోద్‌కుమార్ ఆరోపించారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ ఏదైనా ఒక ప్రకటన చేసే ముందు సమగ్ర వివరాలు తెలుసుకుని చేస్తే బాగుటుందని బండికి ఆయన హితవు పలికారు. భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆయన వ్యాఖ్యలు చేసిన తరువాత చాలా బాధ కలిగిందని వినోద్‌కుమార పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టుకు సరఫరా చేసిన యంత్రాలు పూర్తిగా బిహెచ్‌ఇఎల్ సంస్థవేనని అన్నారు. అలాంటప్పుడు భద్రాద్రిలో అవినీతి జరిగితే… అందులో కేంద్రానికి ఎంత వాటో చెప్పాలన్నారు. బిహెచ్‌ఇఎల్ ఇచ్చిన సామాగ్రి పూర్తిగా తుప్పుపట్టిన యంత్రాలా? అన్న విషయంపై కూడా బండి స్పష్టత ఇవ్వాలన్నారు. అవి నిజంగానే తుప్పుపట్టిన యంత్రాలు అయితే తగు చర్యలు ఎవరి మీద తీసుకుంటారని బండిని ఉద్దేశించి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఆరోపణలు చూస్తుంటే సిఎం కెసిఆర్…. ప్రధాని నరేంద్రమోడీకి పైసలు ఇచ్చినట్లు ఉన్నట్లుగా ఉందన్నారు. భద్రాద్రి ప్రాజెక్టు కోసం అంబానీ, అదానీలు వచ్చినా సిఎం కెసిఆర్ వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వరంగ సంస్థలకే ఇచ్చారన్నారు. ప్రైవేటు కంపెనీలు వస్తే ఎందుకు ఇవ్వలేదని కేంద్ర మంద్రి పీయూష్ గోయల్ కూడా సిఎం కెసిఆర్‌ను అడిగారన్నారు. కానీ బిహెచ్ ఇఎల్ ఆర్ధికంగా నిలదొక్కుకోవాలన్న లక్షంతోనే ఆర్డర్ ఇచ్చారననారు. అది కెసిఆర్ గొప్ప తననానికి నిదర్శనమన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాల అప్పులు తీసుకుంటాయి, కానీ తీసుకున్న అప్పును సరిగ్గా చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ చెప్పిందని వినోద్‌కుమార్ అన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు….కేవలం ప్రజలు, రైతుల కోసమేనని అన్నారు. అప్పుల్లో ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. జీతాలకు…- అప్పులకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర ఆదాయంతోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ పథకాలు నడుస్తాయన్నారు. కొత్త అప్పులు అడిగేది మరిన్ని ప్రాజెక్టులు కట్టడానికేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని బట్టి అప్పులు వస్తాయన్నారు. కానీ కేంద్రం దురుద్దేశ్యంతోనే కావాలనే అడ్డు పడుతోందని వినోద్‌కుమార్ విమర్శించారు.

మోడీ ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం వంద లక్షల కోట్లు అప్పులు చేయొచ్చు….. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేయవద్దా? అని వినోద్‌కుమార్ నిలదీసారు. మరి కేంద్రం వంద లక్షల కోట్లు వేటి కోసం అప్పు చేశారో చెప్పగలరా? ప్రశ్నించారు. అప్పుల గురించి న్యాయపరమైన నిబంధనలు అన్ని పాటిస్తామని…ఇందులో బండికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. సిఎం కెసిఆర్ కార్యదక్షత గల నాయకుడని వారు పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తిని 24వేల మెగావాట్లకు తీసుకెళ్లారన్నారు. ఈ విషయంపై నేలమీద తిరిగితే విద్యుత్ వెలుగులు కనిపించకపోతే బండి సంజయ్ విమానంలోనైనా తిరగాలని సూచించారు. అప్పుడే తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు తేడా తెలుస్తుందన్నారు. ఆ రాష్ట్రాల్లో కరెంట్ ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు అవకాశముంటుందన్నారు.

సిఎం కెసిఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతుంటే….కేంద్రం వాటిని అమ్ముతోందని విమర్శించారు. బిహెచ్‌ఇఎల్ సంస్థ నుంచి సామాగ్రి కొన్నాం కాబట్టే…ఇవ్వాళ రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వచ్చాయి .గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లుగా… తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కెసిఆర్ లేకపోయి ఉంటే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసే పరిస్థితి ఉండేదన్నారు. అలాగే గతంలో ఎన్‌టిపిసికి యూనిట్‌కు 7 రూపాయలు ఇచ్చి కరెంట్ కొనేవాళ్లమన్నారు. వాస్తవానికి దేశ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని జలశక్తికి రాష్ట్రం సిఎండి లేఖ రాశారని, రూ.6.76 నుంచి రూ. 12 వరకు కరెంట్ కొనాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందన్న విషయాన్ని బండి సంజయ్‌కు తెలియదా? అని వినోద్ నిలదీశారు. ఇందులో కూడా అవినీతి జరిగిందని బండి చేసిన ఆరోపణలు చూస్తుంటే…. ఆయనకు పూర్తిగా మతిభ్రమించిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ తలాతోక తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన హితబోధ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News