Monday, May 6, 2024

ప్రతిపక్షాలవి చౌకబారు మాటలు

- Advertisement -
- Advertisement -

* కెసిఆర్ పాలనలో గ్రామీణ రోడ్లకు మహర్దశ
* ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి రూరల్ : ఈ నెల 6న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సిఎం కెసిఆర్ బహిరంగ సభ ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిఎం బహిరంగ సభ విజయవంతం చేసేందుకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలన సౌలభ్యం కోసం ఆధునిక హంగులు, నూతన సాంకేతిక పరిఙ్ఞానం మేలవించి నిర్మించిన కలెక్టరేట్ బంగ్లాలు, ఎస్పి కార్యాలయాలు జిల్లాకు తలమానికలుగా నిలుస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లతో కలెక్టరేట్, ఎస్పి బంగ్లాలు నిర్మాణం చేపట్టిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. 200 వాహనాల్లో జన సమీకరణ చేసి జిల్లాలో అధికంగా కల్వకుర్తి నుంచి తరలిస్తామని ఆయన అన్నారు. జన సమీకరణ కోసం మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సిఎం సభను విజయవంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.
= మున్సిపాలిటీ అభివృద్ధికి 2 కోట్ల 50 లక్షలు
కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎస్‌డిఎఫ్ నుంచి భారీగా నిధులు కేటాయించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుందని ఆయన అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటి అభివృద్ధికి రెండు కోట్ల 54 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తన ఎస్‌డిఎఫ్ నిధుల నుంచి మంజూరు చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
= నియోజకవర్గంలో పల్లె రోడ్లకు మహర్దశ
కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సారధ్యంలో మహర్దశ వచ్చింది. గ్రామీణ రోడ్లకు 11 కోట్ల 55 లక్షల రూపాయలను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంజూరు చేయించారు. తలకొండపల్లి మండలం మాదేపల్లి రోడ్డుకు 50 లక్షలు కేటాయించారు. మూడు కోట్ల రూపాయలతో వీరన్నపల్లి గ్రామం నుంచి తలకొండపల్లి వరకు నూతనంగా బిటి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఆమన్‌గల్ మండలంలోని సింగంపల్లి గ్రామానికి 3 కోట్లతో నూతనంగా బిటి రోడ్డుకు నిధులు మంజూరు చేశారు. లింగరావుపల్లి గ్రామానికి కోటి రూపాయలతో బిటి రోడ్డు నిర్మించనున్నారు. కల్వకుర్తి మండలంలోని చిన్న ముకురాలకు 45 లక్షలు, వెల్దండ మండల కేంద్రం నుంచి రాచూరుకు మూడు కోట్ల రూపాయలు నూతనంగా బిటి రోడ్డుకు ఏర్పాటు చేయనున్నారు. వెల్దండ మండలం కొట్ర గ్రామ పంచాయతి పరిధిలోని బుడ్డోనిపల్లికి మూడు కోట్ల రూపాయల బిటి రోడ్డుకుమంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విలేఖరుల సమావేశంలో మున్సిపల్ చైర్మెన్, మార్కెట్ కమిటీ చైర్మెన్ సింగం విజయ్ గౌడ్, కౌన్సిలర్ మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమున శ్రీకాంత్, రాచూర్ గుత్తి వెంకటయ్య, పలు గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News