Friday, May 3, 2024

ఒసాకాకు షాక్

- Advertisement -
- Advertisement -

Osaka defeat In women's singles at US Open Grand Slam tournament

సబలెంకా స్విటోలినా ముందుకు

సిట్సిపాస్, రుబ్లేవ్ ఔట్, యూఎస్ ఓపెన్

న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ నవోవి ఒసాకా (జపాన్) మూడో రౌండ్‌లోనే ఇందటిదారి పట్టింది. కెనడా క్రీడాకారిణి లైలా ఫెర్నాండేజ్‌తో జరిగిన పోరులో ఒసాకాకు ఓటమి పాలైంది. మరోవైపు రెండో సీడ్ అరినా సబలెంకా (బెలారస్), ఐదో సీడ్ ఎలినా స్విటోలినా మూడో రౌండ్‌లో విజయం సాధించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో కూడా అనూహ్య ఫలితాలు వచ్చాయి. మూడో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ ఆండ్రి రుబ్లేవ్ (రష్యా) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.

ఒసాకా ఇంటికి..

మహిళల సింగిల్స్‌లో కిందటిసారి విజేత ఒసాకా అనూహ్య ఓటమి పాలైంది. కెనడాకు చెందిన అన్‌సీడెడ్ ఫెర్నాండేజ్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో మూడో సీడ్ ఒసాకా పరాజయం చవిచూసింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో కెనడా సంచలనం ఫెర్నాండేజ్ 57, 76, 64తో ఒసాకాను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో ఒసాకా పైచేయి సాధించింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో ఒసాకా జయభేరి మోగించింది. అయితే తర్వాతి రెండు సెట్లలో ప్రత్యర్థి పుంజుకుంది. వరుసగా రెండు సెట్లను గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భావించిన ఒసాకాకు నిరాశే మిగిలింది. అయితే రెండో సీడ్ సబలెంకా మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో అరినా సబలెంకా అలవోక విజయాన్ని అందుకుంది. అమెరికా క్రీడాకారిణి కొలిన్స్‌తో జరిగిన పోరులో సబలెంకా 63, 63తో జయకేతనం ఎగుర వేసింది.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అరినా ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లు గెలిచి నాలుగో రౌండ్‌లో ప్రవేశించింది. మరో మ్యాచ్‌లో 16వ సీడ్ ఎలిసె మెర్టెన్స్ విజయం సాధించింది. ఓన్స్ జాబియర్ (ట్యూనిషియా)తో జరిగిన మూడో రౌండ్‌లో మెర్టెన్స్ 63, 75తో జయభేరి మోగించింది. ఐదో సీడ్ స్విటోలినా కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రష్యా క్రీడాకారిణి డారియా కసాట్కినాతో జరిగిన పోరులో స్విటోలినా 64, 62తో విజయం సాధించింది. మరో పోటీలో 16వ సీడ్ ఎంజిలిక్ కెర్బర్ విజయాన్ని అందుకుంది. అమెరికాకు సియానె స్టీఫెన్స్‌తో జరిగిన పోరులో కెర్బర్ 57, 62, 63తో గెలుపొందింది.

సిట్సిపాస్ ఔట్

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్లుగా భావించిన సిట్సిపాస్, రుబ్లేవ్‌లు మూడో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు. అంతేగాక 18వ సీడ్ బౌటిస్టా అగట్ కూడా ఇంటిదారి పట్టాడు. స్పెయిన్ ఆటగాడు అల్కరాజ్ గార్ఫియాతో జరిగిన ఐదు సెట్ల హోరాహోరీ సమరంలో సిట్సిపాస్ పోరాడి ఓడాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన మారథాన్ సమరంలో గార్ఫియా 63, 46, 76, 06, 76తో విజయం సాధించాడు. ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడినా చివరికి విజయం మాత్రం గార్ఫియాను వరించింది. మరో మ్యాచ్‌లో రుబ్లేవ్ కూడా పోరాడి ఓడాడు. ఐదు సెట్ల సమరంలో అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియోఫె చేతిలో కంగుతిన్నాడు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్సెస్ 46, 63, 76, 64, 61తో విజయం సాధించాడు. ఇతర పోటీల్లో 11వ సీడ్ డిగో షావర్ట్‌మాన్ (అర్జెంటీనా), 12వ సీడ్ ఫెలిక అగర్ (కెనడా) తదితరులు విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News