Sunday, April 28, 2024

ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి

- Advertisement -
- Advertisement -

PM-Modi

డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభ సభలో
ప్రధాని మోడీ వెల్లడి

లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం వెల్లడించారు. 11 వ డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వదేశీతయారీని ప్రోత్సహించడానికి విదేశీ పెట్టుబడి దారులను ఆకర్షించడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. భారత్ వంటి పెద్ద దేశం దిగుమతులపై పూర్తిగా ఆధారపడకూడదని, గత ఐదేళ్లలో డిఫెన్స్ లైసెన్సులు భారీగా మంజూరు చేయడమైందని, తాము మొదట అధికారంలోకి వచ్చి న 2014లో 210 లైసెన్సులు జారీ చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 460కు చేరుకుందని మోడీ వివరించారు.

ఆర్మీతుపాకులు, యుద్ధ విమానా లు, సబ్‌మెరైన్లు, తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్లు, శత్రు భేద్య హెలికాఫ్టర్లు వంటివి భారత్ స్వయం గా తయారు చేస్తోందని, తమ లక్షం దేశంలో తయారీ, దేశం కోసం తయారీ, ప్రపంచం కోసం తయారీ అని ఆయన పేర్కొన్నారు. 2014లో భారత్ నుంచి రూ.2000 కోట్ల విలువైన రక్షణ సాధనాల సామగ్రి ఎగుమతి కాగా, గత రెండేళ్లలో రూ.17000 కోట్ల విలువైన సామగ్రి ఎగుమతి అయిందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఎగుమతులు సాధించాలన్నది తమ లక్షంగా ఆయన తెలిపారు. ప్రపంచంలో భారత్ పెద్ద మార్కెటే కాదు ప్రపంచానికే గొప్ప అవకాశంగా ఆయన అభివర్ణిస్తూ దేశంలోనే రక్షణ సామగ్రి తయారీలో ఉత్తర ప్రదేశ్ పెద్దహబ్‌గా అభివృద్ధి చెందనున్నట్టు చెప్పారు.

సాంకేతికతను దుర్వినియోగపర్చడం, ఉగ్రవాదం, సైబర్ ముప్పు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లుగా మారాయని, ఈ కొత్త సవాళ్లను దృష్టిలో పెట్టుకుని రక్షణ విభాగాలు అత్యంత ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. రక్షణ రంగంలో కృత్రిమ మేథో పరిజ్ఞానాన్ని అమలు చేయడానికి అంతా సిద్ధమైందని అన్నారు. రానున్న సంవత్సరాల్లో అంతరిక్షంలో మన పరిధి విస్తరించుకోవడమౌతుందని ఇస్రో తయారు చేసే వ్యోమనౌకలకు రక్షణ కల్పించేలా డిఆర్‌డిఒ తన సామర్ధాన్ని పెంచుకోవాలని చెప్పారు. విదేశీ రక్షణ సాధనాల తయారీ దారులు భారత్‌లో తమ పెట్టుబడులను పెట్టాలని ఆహ్వానించారు.

Our target is $5 bn of defence export in next 5 years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News