Saturday, April 27, 2024

సీరం ఆధ్వర్యంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్

- Advertisement -
- Advertisement -

సీరం ఆధ్వర్యంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
తొలిదశలో ఇద్దరు వ్యక్తులపై పరీక్ష

Oxford vaccine trials under serum Institute

పుణే: కోవిడ్ నివారణ దిశలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఫేజ్ 2 క్లినికల్ పరీక్షలు పుణేలో ఆరంభం అయ్యాయి. ఈ వ్యాక్సిన్ తయారీకి స్థానిక సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)కి ఇటీవలే ఔషధ నియంత్రణ మండలి అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో ఇక్కడి భారతి విద్యాపీఠ్ వైద్యకళాశాల, ఆసుపత్రిలలో క్లినికల్ ట్రయల్స్ మొదలు అయ్యాయి. ఇద్దరు మగ వాలంటీర్లపై ఈ టీకామందును పరీక్షించి ఫలితాలను నిర్థారించుకోనున్నారు. వీరికి క్లినికల్ ట్రయల్స్ చేపట్టినట్లు ఆసుపత్రి నిర్వాహకులలో ఒకరు బుధవారం తెలిపారు. కోవిషీల్డ్ పేరిట ఆక్స్‌పర్డ్ వ్యాక్సిన్ సమగ్రరీతిలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌ను తొలుత 32 ఏండ్ల ఓ వ్యక్తిపై ప్రయోగించారు. డాక్టర్ల బృందం పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తల నడుమ ఈ క్లినికల్ ట్రయల్స్ ఆరంభం అయ్యాయి. ఈ వ్యక్తికి కోవిడ్ 19, యాంటీబాడీస్ టెస్టులు నెగెటివ్ అని తేలిన తరువాత ఈ వ్యాక్సిన్‌ను ఆయనలో ప్రవేశపెట్టి పలితాలను బేరీజు వేసుకుంటున్నట్లు భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి రిసెర్చ్ సెంటర్ వైద్య సంచాలకలు అయిన డాక్టర్ సంజయ్ లాల్వానీ తెలిపారు.

48 ఏండ్ల మరో వ్యక్తిపై కూడా వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. 32 ఏండ్ల వాలంటీర్ ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. మరో వ్యక్తి ఆరోగ్య కేంద్రంతో సంబంధం ఉన్నవారు. ఈ వ్యాకిన్ పరీక్షలు అత్యంత కీలకమైనవి కావడంతో వ్యాక్సిన్ ప్రయోగానికి ముందు దీనికి అంగీకరించిన ఇద్దరు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి టెంపరేచర్, బిపి, గుండె స్పందన అన్నింటిని విశ్లేషించుకున్న తరువాతనే వ్యాక్సిన్ వేశారు. ఇప్పటికి ఈ ట్రయల్స్ కోసం ఐదుగురు స్వచ్ఛందంగా ముందకు వచ్చారు. వచ్చే వారం రోజులలో మొత్తం పాతిక మందిపై ఈ వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహిస్తారని వైద్య కళాశాల సంచాలకులు తెలిపారు. ప్రపంచ స్థాయిలో అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ అయిన సీరం ఇనిస్టూట్ ఇటీవలే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి సమగ్ర ఒప్పందం కుదుర్చుకుంది.

Oxford vaccine trials under serum Institute

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News