Wednesday, May 1, 2024

దద్దరిల్లిన పార్లమెంట్

- Advertisement -
- Advertisement -

పొగబెట్టిన ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన కోసం విపక్షాల పట్టు

వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్షాలు

14మంది విపక్ష సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన లోక్‌సభ స్పీకర్

రాజ్యసభలో టిఎంసి సభ్యుడిపై సస్పెన్షన్‌వేటు

ఆ తరువాత డిఎంకె లోక్‌సభ సభ్యుడి సస్పెన్షన్ ఉపసంహరణ

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో గురువారం సస్పెన్షన్ల వేడి రగులుకుంది. ఒకేరోజు మొత్తం 15 మంది ఎంపిలను స స్పెండ్ చేశారు. లోక్‌సభ నుంచి 14 మందిని , ఎగువసభ రాజ్యసభ నుంచి ఒక్కరిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలను విచ్ఛిన్నపరుస్తున్నారని పేర్కొంటూ వీరిపై ఈ చర్యకు దిగారు. సస్పెండైన వారిలో తొమ్మండుగురు కాంగ్రెస్‌కు, ఇద్దరు సిపిఎంకు, ఒక్కరు సిపిఐకు, ఇద్దరు డిఎంకెకు చెందిన వారు ఉన్నారు. టిఎంసికి చెందిన రాజ్యసభ సభ్యులు డెరెక్ ఒబ్రియన్ కూడా ఈ వేటుపడ్డ వారిలో ఉన్నారు.

ఒక్కరోజు క్రితం పార్లమెంట్‌లో తీవ్రస్థాయి భద్రతా వైఫల్యం , యువకుల దాడి ఘటన తరువాత గురువారం ఉదయం సభలు ఆరంభం అయ్యాయి. ఉభయసభల్లోనూ ప్రతిపక్షాలు బుధవారం నాటి ఘటనపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో అసాధారణ స్థాయిలో జరిగిన భద్రతా వైఫల్యం దేశవ్యాప్త కలకలానికి దారితీసింది. మరి భద్రతా వ్యవస్థ ఏం చేస్తోంది. ఎక్కడ లోపాలు తలెత్తాయి? అడ్డగోలుగా విజిటర్స్ పాస్ వెలువరించిన మైసూరు బిజెపి ఎంపిపై చర్య తీసుకున్నారా? అని విపక్ష సభ్యులు లోక్‌సభలో, రాజ్యసభలో డిమాండ్‌కు దిగారు. హోం మంత్రి అమిత్ షా నుంచి ప్రకటనకు పట్టుపట్టారు. ముందుగా తమకు తగు సమాదానం ఇవ్వాల్సి ఉందని చెపుతూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. దీనితో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఎంపిల సస్పెన్షన్‌కు తీర్మానం ప్రవేశపెట్టారు.

కొందరు సభ్యులు వ్యవహరించిన తీరు పూర్తిగా సభా నిబంధనల ఉల్లంఘనల పరిధిలోకి వచ్చిందని, వీరిని ఈ సెషన్ అంతా బహిష్కరించాలని తీర్మానం చేయగా దీనికి సభలు ఆమోదం తెలిపాయి. ఇప్పుడు సస్పెండ్‌కు గురైన ఎంపిలలో కాంగ్రెస్ ఎంపిలు మాణిక్కం ఠాగూరు, ఎండిజావెద్, వికె శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డిఎంకె సభ్యులు కనిమొళి, ఎస్‌పి పార్థిబన్, సిపిఎం ఎంపిలు పిఆర్ నటరాజన్, ఎస్ వెంకటేశన్, సిపిఐకి చెందిన కె సుబ్బరాయన్ ఉన్నారు. పార్లమెంట్ నుంచి ఒకేసారి ఇంత మంది ఎంపిలను సస్పెండ్ చేయడం తీవ్ర సంచలనానికి దారితీసింది. అయితే డిఎంకె సభ్యుడు పార్దీబన్‌ను పొరపాటున సస్పెండ్ చేశామంటూ ఆ తరువాత ఆయన సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News