Saturday, May 11, 2024

ప్రయాణికుల చూపు ఆర్‌టిసివైపు

- Advertisement -
- Advertisement -

Passenger interest in traveling on RTC buses

ఆర్‌టిసి ఎండి మార్గదర్శకంలో మరింత బాధ్యతగా పని చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్: ఆర్‌టిసి ఎండి సజ్జనార్ మార్గదర్శకత్వంలో అధికారులు చేస్తున్న పలు ప్రయోగాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు అంతగా ఆసక్తి చూపని ప్రయాణికులు ప్రస్తుతం ఆర్‌టిసిలో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. బస్సుతో భరోసా వంటి ప్రచారంతోనే కాకుండా అధికారులు క్రియారూపంలో చేస్తున్న పనుల పట్ల ప్రయాణికులు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు అత్యవసరాల కోసం బస్సులను ఆపేలా చర్యలు తీసుకోవడం, ఉదయం నాలుగు గంటల నుంచి బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు.. ఆర్‌టిసిలో చిల్లర సమస్యకు చెక్‌పెట్టే విధంగా క్యూఆర్ కోడ్ పద్దతుల అమలు, ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించు కుంటూ ఏ బస్సు ఎక్కడ ఉంటుందో ప్రయాణికులు తెలుసుకునేలా వీటిఎస్ ( వెహికల్ ట్రాకింగ్ సిస్టం) వంటి చర్యలతో ప్రయాణికుల్లో ఆర్‌టిసి బస్సుల్లోనే ప్రయాణించేలా చేస్తున్నారు.

గతంలో బస్టాపుల్లో ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో , బస్సు ఎటువైపు వెళుతుందో తెలియక తికమక పడేవారు. దాంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో ఇటు సంస్థకే కాకుండా అటు ప్రయాణికులకు కూడా నష్టం వాటిల్లేది. కాని అధికారులు బస్టాపుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రూట్ మ్యాప్‌లతో ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేకుండా తమ గమ్యస్థానాలను సులభంగా చేరుకోగలగుతున్నారు. అంతే కాకుండా ప్రయాణికులకు తమకు సంబంధించిన సమస్యలను ట్విట్టర్‌ద్వారా ఎండికి తెలియ చేయడంతో ఆయన పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రయాణికులకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా క్షణాల్లో పరిష్కారం అవుతోంది. రోజువారీ బస్సుప్రయాణికుల అవసరాలు తీరుస్తూ టికెట్ మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే దృష్టి సారించకుండా టికేటేత ఆదాయంపై కూడా దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో ప్రయాణికులు వివాహాది శుభకార్యాలకు బస్సులు ముందస్తు బుక్ చేసుకోవాలంటే ముందుగా తగినంత డిపాజిట్‌ను చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ నిబంధనను పూర్తిగా ఎత్తివేసి ఎటువంటి ముందస్తు డిపాజిట్ లేకుండా ఆర్‌టిసిబ్సులను తమ ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు వినియోగించుకునే అవకాశం ఇచ్చారు.

దీంతో కొంత మొత్తం ప్రయాణికులకు కలిసి రావడంతో వారు ఆర్‌టిసి బస్సులను బుక్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో అధికారులు ఆగకుండా మరో అడుగు ముందుకేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సేవలు అందించే కార్గోపార్సిల్ సర్వీసులకు సంబంధించిన చార్జీలను కొంత మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. గతంలో 0 నుంచి 10 కేజీలకు రూ : 80 తీసుకుంటుండగా దాన్ని రూ. 55కు తగ్గించారు. అదే విధంగా 11 నుంచి 30 కిలోలకు రూ.150 ఉండగా ప్రస్తుతం రూ.90కి తగ్గించారు, 51 నుంచి 100 కిలోల బరువు ఉండే పార్సిల్ సర్వీసులకు రూ.300 ఉండగా దాన్ని రూ.180 తగ్గించేవారు . పార్సిల్ కవర్ల ధరలను కూడా అధికారులు తగ్గించారు. 500 గ్రాముల వరకు రూ.30 వసూలు చేస్తుండగా ప్రస్తుతం రూ.15 మాత్రమే తీసుకుంటున్నారు.అదే విధంగా 501 నుంచి 1000( 1కిలో) గ్రాములకు రూ.50 ఉండతా ప్రస్తుతం రూ. 25 మాత్రమే తీసుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News