Saturday, May 4, 2024

ఫీజు బకాయిలు రూ.5 వేల కోట్లు చెల్లించండి

- Advertisement -
- Advertisement -

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు కృష్ణయ్య వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని 20 లక్షల మంది ఇంజనీరింగ్, మెడిసిన్, పిజి, డిగ్రీ విద్యార్థుల మొత్తం ఫీజు బకాయిలు 5వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బిసి ప్రతినిధి బృందం గురువారం ఉప ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర కాలేజీ కోర్సులు చదివే ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థుల 5వేల కోట్ల పీజుల బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

ప్రభుత్వం బడ్జెట్ సకాలంలో విడుదల చేయక పోవడంతో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను పీజులు కట్టాలని వత్తిడి చేస్తున్నారని, క్లాసులు నుంచి బయటకు పంపి ఎండలో నిలబెట్టి అవమాన పరుస్తున్నారని తెలిపారు. కోర్సు పూర్తయిన వారికి సర్టిపికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీని వల్ల బిఇ, బిటెక్, ఫార్మసి, ఎంటెక్, ఎంబిఎ, ఎంసిఎ, పిజి, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. . మొత్తం ఫీజులు విద్యార్థులు కట్టిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారని అన్నారు. రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం విద్యార్థులకు కూడా ఫీజులు కట్టాలని వత్తిడి తెస్తున్నారని, ప్రభుత్వం మంజూరు చేసిన తర్వా త విద్యార్థులకు వాపస్ ఇస్తామని, పీజులు కట్టలేక పోతే క్లాసులకు రానివ్వటం లేదుదని తెలిపారు. దీని వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటోందన్నారు. పి.జి కోర్సులలో సీట్లు పొందిని వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఉద్యోగాలు పొందినవారు, ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని, పరీక్షల్లో హాల్ టికెట్లు ఇవ్వడం లేదని, విద్యార్థులను క్లాసులకు రానివ్వడం లేదని, పీజులు రాకపోవడంతో చదువుకోవడం ఇబ్బందిగా తయారైందని కృష్ణయ్య మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్, పగడాల సుధాకర్, రాజ్‌కుమార్, అంజి, ఉదయ్ నేత, మధు, శివ, రఘుపతి, రాకేశ్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News