Saturday, April 27, 2024

డ్రగ్స్ విక్రేతలపై పిడి యాక్ట్

- Advertisement -
- Advertisement -

PD Act on two accused selling drugs

ఉత్తర్వులు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని మంగళ్‌హాట్‌కు చెందిన రోహిత్ సింగ్ గంజాయి విక్రయిస్తుంటాడు. గతంలో కూడా పోలీసులు గంజాయి విక్రయిస్తుండగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి విక్రయించడం ప్రారంభించాడు. నిందితుడిపై మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. నగరంలోని గంజాయి విక్రేతలపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వరుసగా దాడులు చేస్తూ విక్రయిస్తున్న వారిని పట్టుకుంటున్నారు. గతంలో కూడా గంజాయి విక్రయించిన వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీకి చెందిన మహ్మద్ సలీం వంటపని చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి యువతకు మెఫేడ్రోన్ విక్రయిస్తున్నాడు. నిందితుడిని గతంలో అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పిడి యాక్ట్ పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News